A.R. Rahman: తినడానికి చిల్లిగవ్వ లేదు.. కానీ ఏఆర్ రెహమాన్ వాళ్ళ అక్క కోసం ఏం చేశాడో తెలుసా?

A.R. Rahman: సినీ ప్రియులకు మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు వినాలంటే ఎవరైనా గాలిలో తేలిపోవాల్సిందే. మిగతా పాటలు కంటే ఏ ఆర్ రెహమాన్ సాంగ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. ఎంతలా అంటే ఒకసారి వింటే మరోసారి వినాలనిపించేలా ఉంటాయి.

ఇక ఏఆర్ రెహమాన్ తన తండ్రి నుంచి వారసత్వం పుచ్చుకొని ఇప్పుడు సంగీత దర్శకుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. తన తండ్రి రెహమాన్ కు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. కాగా కుటుంబ బాధ్యత అంతా రెహమాన్ పైన పడింది. ఇక కుటుంబాన్ని పోషించడానికి రెహమాన్ పలు సంగీత దర్శకుల దగ్గర పనిచేశాడు. ఒక్కోసారి రెహమాన్ దగ్గర తినడానికి చిల్లిగవ్వ కూడా ఉండేది కాదట.

నిజానికి ఏఆర్ రెహమాన్ పేరు మొదట దిలీప్. అసలు దిలీప్ నుంచి రెహమాన్ నీ పేరు రావడానికి కారణం. రెహమాన్ వాళ్ళ అక్క ఒకరోజు తీవ్ర అనారోగ్య స్థితికి చేరిందట. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందట. వైద్యం చేపించడానికి రెహమాన్ దగ్గర డబ్బులు కూడా లేవు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. ఆ సమయంలో దేవున్ని గట్టిగా నమ్ముకున్నాడు. తన అక్క చావు నుంచి బయటపడితే ఇస్లాం స్వీకరిస్తానని ఒక దర్గా దగ్గర మొక్కుకున్నాడు.

ఇక కోరుకున్న విధంగానే రెహమాన్ వాళ్ళ అక్క చావు బ్రతుకుల నుంచి బయటపడింది. తన దగ్గర రూపాయి డబ్బులు లేని దిలీప్ కి దేవుడే దిక్కు అయ్యాడు. దీంతో దిలీప్ కోస్తా అల్లా రఖా రెహమాన్ గా మారడు. ఇక దిలీప్ తో పాటు తన తల్లి కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. అలా ఏఆర్ రెహమాన్ చిన్న వయసులో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Prabhas-Sreeleela: ప్రభాస్, శ్రీలీల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమేనా?

Prabhas-Sreeleela:  పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి శ్రీ లీల. ఇలా మొదటి సినిమాతోనే తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం రవితేజ...
- Advertisement -
- Advertisement -