Balakrishna: ఎన్టీఆర్ పేరు మార్పుపై నటడ నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగు జాతి వెన్నెముక అంటూ కామెంట్ చేశారు. జగన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ బాలకృష్ణ ట్వీట్ చేశారు. తండ్రి గద్దెనెక్కిన తర్వాత ఎయిర్ పోర్టులో పేరు మార్చారని, కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని బాలకృష్ణ వ్యక్తం చేశారు. త్వరలోనే జగన్ ప్రభుత్వాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రజలతో పాటు పంచభూతాలు కూడా సిద్ధంగా ఉనానయన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. వైసీపీలో కూడా మహనీయుడు పెట్టిన రాజకీయ దీక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతల ఉన్నారు, విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని కామెంట్ చేశారు. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు. అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. పేరు మార్చినంతా మాత్రన ఎన్టీఆర్‌ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోరని ఆయన వారి గుండెల్లో చిరర్మరణీయంగా నిలిచిపోయారని బాల కృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశంలో జరిగిన అభివృద్ధి తప్ప ఆంద్రలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.