Karthi: కూతురు పుట్టిన ఏదేళ్లకు కొడుకు.. ఇంత గ్యాప్ కు కారణం?

Karthi: తెలుగు ప్రేక్షకులకు హీరో కార్తీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యుగానికి ఒక్కడు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తమిళ ఇండస్ట్రీలో హీరో కార్తీ గురించి తన ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఇక హీరో కార్తీ కి రంజని తో 2011లో వివాహం జరిగింది. ఇక 2013లో వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ఏడేళ్ల వరకు వీరికి సంతానం కలగలేదు. తర్వాత వీరిద్దరి దంపతులు ఒక బాబుకు జన్మనిచ్చారు. మొదట వీరిద్దరూ ఒక బిడ్డ చాలు అనుకున్నారట. కానీ తర్వాత మరో బిడ్డ కూడా కావాలని అనుకున్నారు.

ఎందుకంటే ఒకసారి కార్తీ అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు. చాలా రోజులు పాటు చికిత్స చేయించుకోవలసి వచ్చిందట. ఆ సమయంలో కార్తీ చెల్లి బృంద తన పిల్లలను తన భర్తకు అప్పజెప్పి నా దగ్గరకు వచ్చి నాకు నయం అయ్యే వరకూ నన్ను బాగా చూసుకుందని తెలిపాడు. అంతేకాకుండా తోబుట్టువులంటే నా చెల్లి ప్రాణం ఇస్తుందని చెప్పాడు. ఇదే సంఘటన తన భార్య రంజని విషయంలో కూడా జరిగిందట.

రంజని ఒకసారి అనారోగ్యానికి గురైందని.. ఒక షూటింగ్ నేపథ్యంలో కార్తీ తన భార్యతో ఉండలేకపోయాడట. అప్పుడు రంజని తమ్ముడు ఆమెను చూసుకోవడానికి వచ్చాడట. అప్పటికి హీరో కార్తీ బావమరిదికి పెళ్లి సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఆ పనులన్నీ పక్కనపెట్టి తన అక్కను చూసుకోవడానికి వచ్చాడని కార్తీ తెలిపాడు. తోబుట్టువుల బంధం అంటే ఇలా ఉంటుంది. అందుకే నా కూతురికి ఒక చెల్లో తమ్ముడో కావాలని మేం భావించాం అన్నట్లు హీరో కార్తీ చెప్పుకొచ్చాడు. నిజానికి హీరో కార్తీ, సూర్యలు ఇద్దరు స్టార్ హీరోలే వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బాండ్ మరో స్థాయిలో ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -