Nithiin: టాలీవుడ్ పై కాషాయ పార్టీ ఫోకస్.. మొన్న ఎన్టీఆర్.. నేడు నితీన్

Nithiin: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కమలదళం అన్ని అవకాశాలను ఉపయోగించుకోంటోంది. ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకునేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ తమదేనని చెప్పుకుంటున్న కమల నేతలు.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విబేధాలతో ఆ పార్టీ చతికిలిపడిపోతుంది. దీంతో ప్రస్తుతం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతనే కనిపిస్తోంది. ప్రజల్లో కూడా కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమనేది నాటుకుపోయింది. దాని వల్ల ప్రజల్లో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు కమల నేతలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. అన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకోవడం, ఆర్ధిక, మీడియా పరంగా రాష్ట్రంలో స్ట్రాంగ్ అవుతోంది. ఇప్పుడు పార్టీకి సినీ గ్లామర్ తెచ్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏ పార్టీకైనా సినీ గ్లామర్ అనేది చాలా ముఖ్యం. సినీ హీరోలు, నటులకు ఫ్యాన్స్ ఉండటమే కాకుండా ప్రజలను ప్రభావితం చేసే టాలెంట్ కూడా ఉంటుంది. దీంతో పార్టీకి సినీ గ్లామర్ పెంచుకుంటే ఓటర్లు తమవైపు మళ్లుతారనే ఆలోచనలో టీ బీజేపీ ఉంది. అందుకే సినీ సెలబ్రెటీలను ఆకర్షించే పనిలో ఉంది. వారిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను కేంద్ర హోమంత్రి అమిత్ షా భేటీ కావడం తెలుగు పాలిటిక్స్ లో ఎంత పెద్ద సంచలనంగా మారిందో తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు నితిన్ ను బీజేపీ ఆహ్వానించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్టీఆర్ ను అమిత్ షా కలిసి 10 రోజులు కాకముందే.. నితీన్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నితీన్ ను కలవడం వెనుక కారణం ఏంటనేది కాషాయ వర్గాలు వెల్లడించలేదు. కానీ దీని వెనుక రాజకీయ కారణం ఉందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. సినీ గ్లామర్ ను పార్టీకి తెచ్చుకునేందుకే ఇలా హీరోలతో బీజేపీ అగ్రనేతలు వరుసగా భేటీ అవుతున్నారనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్ మొత్తం తమ వైపు ఉందిన చెప్పుకోవడం ద్వారా తెలంగాణలో పార్టీకి సినీ గ్లామర్ అడ్వాంటేజ్ కు ఉంటుందని, ఓటర్లను ఆకట్టుకోవచ్చనేది బీజేపీ ప్లాన్ గా అర్థమవుతుంది.

బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్లొనేందుకు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆగస్టు 27న మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. హన్మకొండలో జరగనున్న ఈ సభలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. ఈ సభ అనంతరం నోవాటెల్ లో చేరుకోనున్న నడ్డా.. అనంతరం నితీన్ తో భేటీ కానున్నారు. నితిన్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో.. అతడు బీజేపీ వైపు ఉన్నాడనే సంకేతాలు పంపండం ద్వారా పార్టీకి ప్లస్ అవుతుందనే యోచనలో బీజేపీ ఉంది. నితిన్ తో నడ్డా భేటీ కావడం వెనుక అసలు కారణం ఇదేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ పదవి కట్టబెట్టడం, ఎన్టీఆర్ తో భేటీ కావడం. ఇప్పుడు నితిన్ తో సమావేశం కావడం ద్వారా సినీ హీరోలందరూ బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళుతుంది. ఇక జేపీ నడ్డా నితిన్ తో సమావేశం అయిన అయిన తర్వాత టాలీవుడ్ కు చెందిన పలువురు రచయితలతో కూడా నడ్డా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. విజయేంద్రప్రసాద్ బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ పై ఓ సినిమా తీయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణలో కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు రజకార్స్ సినిమా తీసే ప్రయత్నంలో బీజేపీ ఉంది. దీంతో ఈ సినిమాల కోసమే రచయితలతో జేపీ నడ్డా భేటీ కానున్నారా? అనే చర్చ తెరపైకి వచ్చింది. మరి నడ్డా పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -