Prabhas: హీరో ప్రభాస్ కు ఆ వ్యాపారంపై ఆసక్తి ఉందా?

Prabhas: బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. ఆ సినిమా తర్వాత ఆయన చేసే సినిమాకు ఇప్పుడు రెమ్యునరేషన్ కింద రూ.150 కోట్ల వరకూ తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయాలంటే కచ్చితంగా కనీసం రూ.500 కోట్ల బడ్జెట్ ఉండాలి. బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టిన హీరో ప్రభాస్ ఏ సినిమా చేసినా పక్కా హిట్ అవ్వడం ఖాయం. ఒక వేళ ఫ్లాప్ అయినా వంద కోట్ల వరకూ వసూళ్లను రాబట్టగలదు.

ప్రభాస్ హీరోగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ వంటి సినిమాలు రూపొందుతున్నాయి. ఈ సినిమాల బడ్జెట్ మొత్తం కలిపితే రూ. 2000 కోట్లు వరకూ ఉంటుంది. ఒక పరిశ్రమ ఏడాదిలో చేసే సినిమాల మొత్తం బడ్జెట్ కూడా ఇంత ఉండదేమోనని అనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ప్రభాస్ స్టామినా ఏంటో ఈ సినిమాలను చూస్తేనే అర్థమవుతోంది.

ఇంత పెద్ద స్టార్ అయిన ప్రభాస్ తానెప్పుడూ ఇంత పెద్ద నటుడు కావాలని అనుకోలేదట. తన డ్రీమ్ నటుడు కావడం కాదని, వ్యాపారం చేయడమే తన డ్రీమ్ అని ప్రభాస్ తెలిపారు. అందులోనూ హోటల్ బిజినెస్ పై తనకు ఎక్కువ మక్కువ ఉండేదని, ఆ రంగంలోనే తాను రాణించాలని అనుకునేవాడినని తెలిపారు. తాను పెద్ద ఫుడ్డీని అని, బహుశా అందుకే హోటల్ బిజినెస్ వైపు తన మనసు మళ్ళినట్లు ప్రభాస్ తెలిపాడు.

ఆ రోజుల్లో తమ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకపోవడం వల్ల హోటల్ బిజినెస్ అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని తన ఆలోచనలను మానుకున్నట్లు ప్రభాస్ తెలిపాడు. ప్రభాస్ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ గాడ్ ఫాదర్ అయిన కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా రాణించి బీజేపీకి సానుభూతిపరుడిగా కొనసాగారు. ప్రభాస్ కు కూడా రాజకీయాలలో కొంచెం టచ్ ఉండటంతో ఆయన కూడా ఆ దిశగా అడుగులు వేసే సమయం ఉందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -