Hero Shivaji: వైరల్ అవుతున్న హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు!

Hero Shivaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈయన రాజకీయాలలో కూడా కాస్త చురుగ్గా వ్యవహరించి పెద్ద ఎత్తున రాజకీయాలలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు. చాలా కాలం తర్వాత శివాజీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల గురించి పలు విషయాలను వెల్లడించారు.

తాను 95 సినిమాలు చేయగా అందులో 60 సినిమాలు తాను హీరోగా చేశానని మిగిలిన సినిమాలలో కీలక పాత్రలలో నటించానని తెలిపారు. అయితే తాను అన్నీ కూడా మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించానని శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారికి ఆ సినిమాలో నేను సరిపోను అని అనిపించిందని తెలిపారు.

 

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీ సినిమాకు రవితేజ కంటే ముందుగా చాలామంది పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో తన పేరు కూడా ఉందని శివాజీ తెలిపారు. ఇక రవితేజ ఆటోగ్రాఫ్ సినిమాలో నటించిన ఆ సినిమా తనకు సూట్ అవ్వలేదని శివాజీ కామెంట్స్ చేశారు. రవితేజ గారి ఇమేజ్ కి నా ఆటోగ్రాఫ్ సినిమా సరిపోలేదని తెలిపారు.ఆ సినిమాలో తనకు అవకాశం వస్తుందని భావించాను ఆ సినిమా నేను నటిస్తే బాగుంటుందని తనకు అనిపించిందని ఈయన తెలిపారు.

 

ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎవరికి వారే పోటీ అనుకుంటూ ఉంటారు.కానీ సినిమా ఇండస్ట్రీలో టైం అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుందని తెలియజేశారు. ఇక బాపు గారి దర్శకత్వంలో నాకు ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే చివరి క్షణంలో నా పాత్రలో చివరికి శ్రీకాంత్ ఎంపిక అయ్యారు అంటూ ఈ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -