Hero Suman: కూతురిని సుమన్ ఇండస్ట్రీలోకి రానివ్వకపోవడానికి రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hero Suman: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ సుమన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 150 సినిమాలకు పైగా నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కొండపల్లి రాజా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమన్ ఆ తర్వాత శ్రీరామదాసు, అన్నమయ్య వంటి సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

అనంతరం పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక 2022లో మాతృదేవోభవ, అల్లూరి, మీలో ఒకడు సినిమాలతో సుమన్ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో సుమన్ నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

తన కూతురికి ఇండిపెండెంట్ గా ఉండడం చాలా ఇష్టం అని తన స్కూల్లో కూడా నేను సుమన్ కూతురు అని చెప్పుకోవడానికి ఇష్టపడేది కాదట. ఏదైనా తను ఇండివిడ్యువల్ గా ఉండడానికి చాలా ఇష్టపడేది. ప్రస్తుతం ఆమె సైంటిస్ట్. ఆమె నా ఇన్ఫ్లుయెన్స్ తో కాకుండా తన స్వతహాగా ఉండడానికి ప్రయత్నిస్తుందని, అందుకే ఆమె సినీ ఇండస్ట్రీలో కూడా అడుుగు పెట్టలేదు అని సుమన్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక సుమన్ వ్యక్తిగత విషయానికొస్తే 1959 ఆగస్టు 28న మద్రాసులో జన్మించాడు.

ఇక సుమన్ తల్లి కేసరీ చందర్ మద్రాసులోని యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేసింది. ఇక తండ్రి విషయానికొస్తే తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. ఇక సుమన్ అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు సినిమాలో పోషించిన రాముని పాత్ర తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే ఈ రెండు సినిమాలలో సుమన్ దేవుడు నిజంగా ఉంటే అ రూపంలోనే ఉంటాడా అని ప్రేక్షకులు ఆలోచించే విధంగా తన పాత్రను పండించాడు.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -