Ghajini: గజిని సీక్వెల్ కు సర్వం సిద్ధం.. హీరోగా ఛాన్స్ మిస్ చేసుకున్న సూర్య?

Ghajini: డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సూర్య, ఆసిన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం గజిని. 2004వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చేయడం కోసం దర్శకుడు మురుగదాస్ ఎంతోమందిని సంప్రదించినప్పటికీ ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి మతిమరుపు ఉన్న వ్యక్తుల నటించడానికి ఏ హీరో కూడా ఒప్పుకోలేదు.ఈ విధంగా ఎంతో మంది రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ విధంగా సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి భారీ కలెక్షన్లను రాబట్టింది.ఇక ఈ సినిమా విజయం చూసి ఈ సినిమాని రిజెక్ట్ చేసిన హీరోలు సైతం కాస్త నిరాశ వ్యక్తం చేశారనే చెప్పాలి. ఈ విధంగా బ్లాక్ బస్టర్ అందుకున్న గజినీ సినిమా సీక్వెల్ కి అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ కోసం మురగదాస్ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారని త్వరలోనే ఈ విషయం గురించి అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాలో హీరోగా సూర్య నటించలేదనే వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే సీక్వెల్ చిత్రంలో నటించే అవకాశాన్ని పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ దక్కించుకున్నట్టు సమాచారం. గజిని వంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ సినిమా రాబోతుందని తెలియడంతో అల్లు అర్జున్ తన క్రేజ్ ఉపయోగించి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారని ఈ సినిమా విషయంలో సూర్య దారుణంగా మోసపోయారని వార్తలు వినపడుతున్నాయి.

ఈ విధంగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఇందులో హీరోగా అల్లు అర్జున్ నటిస్తున్నారనే విషయం గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే సూర్య అభిమానులు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ గజిని సినిమాలో హీరోగా సూర్య తప్ప ఏ ఇతర హీరోలను ఊహించుకోలేమని ఈ పాత్రకు సూర్య 100% పర్ఫెక్ట్ గా సరిపోతారంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ విషయంపై మురగదాస్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -