Heroine: ఈ హీరోయిన్ విషయంలో తండ్రి అలా ప్రవర్తించారా?

Heroine: తబుస్సుమ్ ఫాతిమా హష్మి అలియాస్ టబు.. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. హైదరాబాద్ లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన టబు.. తర్వాత ముంబైలో స్థిరపడింది. తన స్నేహితురాలు దివ్య భారతి ద్వారా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు పరిచయమైంది. అనంతరం కూలీనెంబర్ 1 సినిమాతో తెరంగేట్రం చేసింది. 1971 నవంబర్ 4న జన్మించిన ఈ సుందరికి తన తండ్రి అంటే అస్సలు సరిపోదట. దానికి కారణాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

 

టబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగింది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీల మేనకోడలైన టబు.. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టి టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ అగ్ర కథానాయికల్లో ఒకరిగా మంచి గుర్తింపు పొందింది. తన పేరులోనూ తబుస్సుమ్ ఫాతిమా హస్మీ అని అమ్మ పేరే ఉంటుంది. కానీ తండ్రి పేరునుగానీ, ఇంటి పేరును గానీ ఇప్పటి వరకు ఎక్కడ వాడలేదు టబు.

 

తన బాల్యం గొప్పగా జరిగిందని చెబుతారు టబు. తన తల్లికి తండ్రి విడాకులిచ్చాక హైదరాబాద్‌లోని అమ్మమ్మవాళ్లింట్లోకి చేరినట్లు తెలిపింది. అక్కడే తన బాల్యం గడిచిందని వివరించింది. తన తల్లి టీచర్‌ కావడంతో తాను ఎక్కువగా అమ్మమ్మతోనే సమయం గడిపేదాన్ని అంటూ చెప్పింది. తన అమ్మమ్మ తన కోసం ఎన్నో పుస్తకాలు చదివి వినిపించేదని బాల్యాన్ని గుర్తు చేసుకుంది. ఆ విధంగానే తాను పెరుగుతూ వచ్చానంది.

 

ఇలాగే సంతోషంగా ఉన్నాను..
తన తండ్రి గురించి ఎప్పుడూ ప్రస్తావన రాలేదని టబు తెలిపారు. తన పేరులోని ఫాతిమా కూడా అమ్మ ఇంటి నుంచి వచ్చిందేనని, తండ్రి పేరు గానీ, ఆయన ఇంటి పేరుగానీ ఎప్పుడూ వాడాల్సిన అవసరం రాలేదని టబు చెప్పింది. తండ్రికి సంబంధించిన ఏ జ్ఞాపకాలూ తన వద్ద లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలా బతుకుతున్నానో, ఇకపై కూడా అలాగే జీవించాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇలాగే సంతోషంగా ఉందని వివరించింది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -