Kriti Sanon: హీరోయిన్ కృతి సనన్ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

Kriti Sanon: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానుంది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది అయితే ట్రైలర్ మాత్రం టీజర్ కన్నా 100 రెట్లు మెరుగ్గా ఉందని చెప్పాలి.

ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఇది ఒక విజువల్ వండర్ లా ఉందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి కృతి సనన్ ప్రభాస్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా కృతి సనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ… ప్రభాస్ కూడా ఆ రాముడిలాగా చాలా మంచివాడు అంటూ తన మంచితనం పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ మంచితనానికి మారుపేరు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ఈమె కూడా చెప్పడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

 

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కృతి సనన్ ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ మాల్దీవ్స్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు వచ్చిన నేపథ్యంలో కృతి సనన్ ప్రభాస్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -