Priyamani: ముఖ్యమంత్రి కాబోతున్న ప్రియమణి.. ఫ్యాన్స్ షాకయ్యేలా?

Priyamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది ఈ మలయాళ బ్యూటీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా రాణించింది. అయితే కెరీర్ ఫీక్స్ లో ఉన్నప్పుడే సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వెండి తెరపై కనిపించిన ఈ భామ.. బుల్లి తెర ద్వారా మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బుల్లి తెర పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’కి జడ్జిగా వ్యవహరిస్తూ వస్తోంది. అలా మరోసారి తన పాపులారిటీ, క్రేజ్‌ను సంపాదించుకుంది.

సినిమాల్లో కూడా వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది. అయితే కీలక పాత్రల్లోనే నటిస్తూ.. తన పాత్రకు ప్రియారిటీ ఉండేలా చూసుకుంటోంది. ఈ మధ్య రాణా దగ్గుబాటి హీరోగా నటించిన సినిమా ‘విరాట పర్వం’. హీరోయిన్‌గా సాయిపల్లవి నటించారు. అయితే ఈ సినిమాలో ప్రియమణి మంచి పాత్రలో నటించారు. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సినిమా ‘నారప్ప’. ఈ సినిమాలో ప్రియమణి.. వెంకటేష్ భార్య పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దీంతో ప్రియమణికి వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

అయితే తాజాగా ప్రియమణికి సంబంధించిన ఓ వార్త సెన్సెషనల్ అవుతోంది. ఓ సినిమాలో ప్రియమణి పొలిటికల్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా.. వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం.. ప్రియమణి పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్‌గా కనబడనుంది. సెకండాఫ్‌లో ప్రియమణి సీఎం పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. లేడీ సీఎంగా.. పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ప్రియమణి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తే.. భవిష్యత్‌తో మరిన్నీ అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts