Heroines: సినిమా అంటే రంగుల ప్రపంచం. అందులో ఒకసారి కనిపిస్తే చాలాని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఒక్క తప్పుతో సినీ కెరీర్ ను అర్దాంతరంగా ముగించిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. రాత్రికి రాత్రే లక్కు బావుంటే సెలబ్రిటీలు అవుతారు. అయితే టైం తలకిందులు అయితే వారి జీవితాలు కనుమరుగు అవుతాయి.
సినీ రంగంలోకి వచ్చినవారి జీవితం అంతా సుఖంగా ఉందని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. కొన్నిసార్లు హీరోయిన్స్ పై వచ్చే రూమర్స్ వల్ల వారి జీవితాలే నాశనం అవుతున్నాయి. అవే వారికి శాపాలుగా మారుతున్నాయి. స్టార్ గా ఓ వెలుగు వెలిగినా కూడా రూమర్స్ వల్ల పాతాళానికి వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. వివాదాలు వారి సినీ కెరీర్ పై బుసలు కొట్టి అర్దాంతరంగా ముగిసిపోయేలా చేస్తాయి.
ఇలాంటి బాధను ఫేస్ చేసిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మౌన పోరాటంతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ యమున కూడా ఇలాంటి బాధనే అనుభవించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కాకుండా బుల్లి తెరపై కూడా ఆమె నటించి మెప్పించారు. 2011లో బెంగళూరులో ఒక హోటల్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారని టీవీలు, పత్రికల్లో వార్తలు రావడంతో ఆమె జీవితాన్ని మార్చేసింది. కావాలని ఆ కేసులో ఎవరో ఇరికించారని ఆమె అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
తెలుగు, తమిళ్ సినిమాలో కనిపించిన నటి భువనేశ్వరి 2009లో వ్యభిచారం కేసులో అరెస్ట్ అవ్వడం విశేషం. కొందరు సినీ పెద్దలు ఆ కేసు నుండి భువనేశ్వరిని బయటకు తీసుకొచ్చారనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆమె మళ్లీ వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో కోర్టుకెక్కారు.
చెట్టు కింద ప్లీడర్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసి, టీవీ సీరియల్స్ లో నటించిన కిన్నెరా ఓ టీవీ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయారు.
పెద్దరికం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నటి సుకన్య భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ భార్యగా నటించారు. 2014 లో సుకన్య కూడా వ్యభిచారం కేసులో పట్టుబడ్డారు.
కొత్త బంగారం లోకంలో హీరోయిన్ శ్వేతా బసు, తెలుగు నటీమణులు సైరా భాను, జ్యోతి కూడా అప్పట్లో వ్యభిచారం కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచారు. ఈ సంఘటనల తర్వాత వీరు తెరపై కనిపించడం లేదు. అయితే ఈ మధ్యకాలంలో వీరు అడపాదడపా సినిమాలో కనిపిస్తూ వస్తున్నారు.