CM KCR – Revanth Reddy: రంగంలోకి కేసీఆర్, రేవంత్.. మునుగోడులో టెన్షన్.. టెన్షన్..

CM KCR – Revanth Reddy: ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు వాతావరణం హీటెక్కుతోంది. రాజకీయ పార్టీలు కదనరంగంలోకి దిగడంతో మునుగోడులో రాజకీయంగా రక్తికట్టిస్తోంది. శనివారం ఒకే టైమ్ లో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో పర్యటిస్తుండటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. దీని కోసం హైదరాబాద్ నుంచి భారీగా నేతలు, కార్యకర్తలతో మునుగోడుకు కేసీఆర్ బయులుదేరుతారు. మునుగోడులో బలప్రదర్శనకు టీఆర్ఎస్ సిద్దమైంది. బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు.. జనసమీకరణ పెద్దఎత్తున చేయనుంది.

దీని కోసం హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా కార్యకర్తలను తరలించనుంది. దీని కోసం బస్సులు కూడా ఏర్పాటు చేయనుంద. సుమారు లక్ష మందికిపైగా జనాన్ని మునుగోడు బహిరంగ సభకు తరలించాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి కాంగ్రెస్ కంచుకోట అయిన మునుగోడులో తమ బలాన్ని చాటుకోవాలని గులాబీ దళం ప్రయత్నాలు చేస్తోంది.

ఇక టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా మునుగోడులో మకాం వేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో శనివారం పాదయాత్ర చేయనున్నారు. అలాగే మన మునుగోడు-మన కాంగ్రెస్ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యానికి వందనం పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు 100 మంది ఓటర్లకు చేతులెత్తి వందనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు లక్ష మంది ఓటర్ల దగ్గరకు వెళ్లి వందనం చేయనున్నారు.

ఇక రేవంత్ రెడ్డి మునుగోడులో తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వందనాలు చేయనున్నారు. వందనం చేసి మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. ఇక నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంల175 గ్రామాలకు సమన్వయకర్తలను కాంగ్రెస్ నియమించింది. వీళ్లు ఓటర్లను కలుసుకుని వందనం చేయనున్నారు. ఇక లక్ష ఇళ్లపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా చూడాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక ప్రతిగ్రామంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాను ఎగురవేయనున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని 40 వేల కుటుంబాలకు పండ్లు పంపిణీ చేయనున్నారు. అలాగే రేవంత్ రెడ్డి మునుగోడులో పాదయాత్ర చేయనున్నారు. ఇలా ఒకేరోజు సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి మునుగోడులో పర్యటిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇక రేపు మునుగోడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీంతో బీజేపీ కూడా మునుగోడులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

ఇలా మూడు పార్టీలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో మనుగోడు నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీల మయంగా మారింది. ఎక్కడ చూసినా పార్టీల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో మునుగోడులో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -