Homeminister: వైసీపీలో కల్లోలం.. కీలక పదవికి రాజీనామా చేసిన మాజీ హోం మంత్రి సుచరిత

Homeminister: ఏపీ మాజీ హోం మంత్రి, ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబందించి సీఎం జగన్ కు లేఖ రాశారు. అనివార్య కారణాల వల్ల పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక నుంచి జిల్లా రాజకీయాల్లో కలగజేసుకోనంటూ చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతానంటూ వైసీపీ అధిష్టానానికి సమాచారం అందించారు.


జిల్లా అధ్యక్ష పదవికి సుచరిత రాజీనామా చేయడంపై వైసీపీలో కల్లోలం రేగుతోంది. ఆమె ఒక్కసారిగా అనూహ్యం పదవికి రాజీనామా చేయడం జిల్లా వైసీపీ నేతలను షాక్ కు గురి చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన హోంమంత్రిగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. అయితే మూడేళ్ల తర్వాత జగన్ చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో సుచరిత పదవి కోల్పోయారు. కేబినెట్ విస్తరణలో పదవిని కోల్పోవడంతో అసంతృప్తితో తన ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత స్వయంగా జగన్ పిలిచి మాట్లాడటంతో ఆమె రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

రాజీనామా చేయవద్దని జగన్ వాదించడంతో సుచరిత తన నిర్ణయం మార్చుకున్నారు. మంత్రి పదవి నుంచి తప్పించడంతో.. ఆమెను శాంతింప చేసేందుకు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఆమెను జగన్ నియమించారు. అప్పటినుంచి అధ్యక్షురాలిగా సుచరిత కొనసాగుతోన్నారు. కానీ ఉన్నట్లుండి సుచరిత అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం గుంటూరు జిల్లా వైసీపీలో కలకలం రేపుతోంది. తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమె స్టేట్ మెంట్ ఇచ్చారు. సుచరిత రాజీనామాపై వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అయితే సుచరిత రాజీనామా చేయడం వెనుక వైసీపీలో అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి,. స్థానిక వైసీపీ నేతలు ఆమెకు అసలు సహకరించడం లేదని చెబుతున్నారు. ఎవరికి వారు తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, సుచరితను పట్టించుకోవడం లేదని అంటున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్నా.. జిల్లా నేతలు ఆమెకు గౌరవం ఇవ్వడం లేదని, నేరుగా జగన్ తో మాట్లాడుతున్నారని అంటున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా.. ఉత్సహా విగ్రహంలాగే పార్టీ నేతలు మేకతోటి సుచరితను చూస్తున్నారని, అందుకే రాజీనామా చేశారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. నేతలందరూ ఎవరికీ వారు వర్గాలుగా విడిపోయి తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, అధిష్టానం దగ్గర తమ పలుకుబడిని చూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ గుంటూరు జిల్లా వైసీపీలో జరుగుతోంది.

సుచరిత జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా.. నిర్ణయాలు అన్నీ వేరే నేతలు తీసుకుంటున్నారని సుచరిత అనుచరులు చెబుతున్నారు. ఆమెకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటున్నారని సుచరిత వర్గీయులు చెబుతున్నారు. ఆమె పదవి నుంచి తప్పుకోవడంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం వైసీపీలో చాలామంది పోటీ పడుతున్నారు. సుచరిత స్థానంలో ఎవరికి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి దక్కుతుందో చూడాలి.

 

 

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -