Rakesh: పెళ్లి కాకుండానే హనీమూన్.. రాకేశ్ మగాడ్రా బుజ్జి!

Rakesh: టెలివిజన్ రంగంలో ‘జబర్దస్త్’ సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు. కేవలం గేమ్ షోలు, డ్యాన్స్ షోలు, సీరియళ్లతో తెలుగు టీవీ ఫీల్డ్ లో మొనాటనీ వచ్చేసిన వేళ.. ‘జబర్దస్త్’ ఓ ఉప్పెనలా వచ్చింది. కడుపుబ్బా నవ్వించే కామెడీతో యువతతోపాటు పిల్లలు, పెద్దలు, వృద్ధులను కూడా ఈ షో ఆకట్టుకుంది. అందుకే టెలివిజన్ తోపాటు యూట్యూబ్ లోనూ ఈ షోకు ఒక రేంజ్ లో వ్యూస్ వస్తుంటాయి.

 

‘జబర్దస్త్’ ఒక షోగా ఎంత పాపులరో అందులోని కమెడియన్లు కూడా అంతే పాపులర్. ఈ షోలో తమ కామెడీ టైమింగ్, పంచుల ద్వారా ప్రేక్షకుల్లో క్రేజ్ ను సంపాదించిన కమెడియన్లు చాలా మంది ఉన్నారు. కొందరైతే స్టార్ కమెడియన్లుగా మారి.. సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, షకలక శంకర్, హైపర్ ఆది లాంటి వాళ్లు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. సుధీర్ అయితే హీరోగానూ దూసుకెళ్తున్నాడు.

 

ప్రేమ వ్యవహారం నిజమేనా..?
‘జబర్దస్త్’ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. ఆయన తనదైన కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించారు. అయితే సుజాతతో కలసి స్కిట్లలో ఆయన చేసే వినోదం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. వీరి జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరో విషయం ఏంటంటే.. వీళ్లిద్దరూ కలసి స్కిట్ చేస్తున్నప్పటి నుంచి ప్రేమలో పడిపోయారని వినికిడి.

 

సుజాత–రాకేశ్ జంటపై మరో రూమర్ వినిపిస్తోంది. వీళ్లు హనీమూన్ లో ఉన్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దుబాయ్ లో వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఈ ట్రిప్ సుజాత–రాకేశ్ కలసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి కాకుండానే హనీమూన్ కు ఎలా వెళ్తారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందనేది రాకేశ్–సుజాతలకే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -