Honey Rose: వైరల్ అవుతున్న హనీరోజ్ సంచలన వ్యాఖ్యలు!

Honey Rose: హనీ రోజ్.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా వీర సింహారెడ్డి సినిమా తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా హాని రోజ్ పేరు మారుమోగిపోయింది. బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో రెండు పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హనీ రోజ్ భాగ్య నగరంలో సందడి చేసింది. హైదరాబాద్‌ లోని మదీనా గూడలో జైలు థీమ్‌తో కూడిన జిస్మత్ మండీని ఆమె ప్రారంభించింది.

 

అనంతరం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మీడియాతో మీడియాతో మాట్లాడుతూ..వీర‌సింహా రెడ్డిలో నా పాత్రకు సినీ ఇండస్ట్రీ, అభిమానుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో కల నిజమైనట్టు ఉంది. సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇండస్ట్రీకి నేను 14ఏళ్ల వయసులోనే 2005లో ఎంట్రీ ఇచ్చాను. వీరసింహా రెడ్డి కోసం గోపీచంద్ మలినేని నాకు ఫోన్ కాల్ చేశారు. సినిమా గురించి క్లుప్తంగా వివరించారు. ఫోన్ రావడంతోనే నేను ఆశ్చర్యపోయాను.

సినిమాలోరెండు పాత్రల్లో కనిపించాల్సి వచ్చింది. నాకు కూడా అరుదైన అవకాశం. అందువల్ల బాగా కష్ట పడ్డాను. మూవీ సమయంలో బాలకృష్ణ సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆయనతో నటించడంతో కొత్త అంశాలను నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది హనీ రోజ్. సోషల్ మీడియాలో మంచి, చెడ్డ రెండు రకాల కామెంట్స్ వస్తాయి. ఆ రెండింటిని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. కేరళ ఫుడ్ అంటే మరి పిచ్చి. హైదరాబాదీ బిర్యానీ, అన్నం, పెరుగు కూడా నచ్చింది. రొమాంటిక్ పాత్రలు చేయాలని ఉంది. అటువంటి పాత్రలో నటించే అవకాశం వస్తుందేమో అని చూస్తున్నాను.

 

నా మీద ఇంత ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పెళ్లి అంటే బాధ్యత. అందుకే ప్రతి అంశంతో ప్రేమలో ఉన్నాను అని హనీ రోజ్ చెప్పుకొచ్చింది. కాగా హనీ రోజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆమె వస్తుంది అని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. కాగా హనీ రోజ్ వీర సింహారెడ్డి సినిమాతో తెలుగులో యూత్ లో భారీగా క్రియేట్ ని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -