Horror: టాలీవుడ్ డైరెక్టర్లకు ఆ సినిమాలు సక్సెస్ ఇస్తున్నాయా?

Horror: సినీ ఇండస్ట్రీ అనేది హిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక హిట్ ఫార్ములా ఉంటే ఇండస్ట్రీ దాన్నే పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజమౌళి బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేస్తే మిగతా దర్శకులు ఆ ట్రెండ్ ని కొనసాగించిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా ట్రెండ్ లేకపోతే మనం కేజీఎఫ్,కాంతార లాంటి చిత్రాలను ఆస్వాదించగలిగేవాళ్ళం కాదు.

తరాలు మారినా ఇండస్ట్రీకి మారని హిట్ ఫార్ములా!

ఓల్డ్ ఈజ్ డైమండ్ అంటారు. ఈ విషయం హిట్ ఫార్ములా విషయంలో బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన చిత్రాలు కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. మరిన్ని చిత్రాలు ఈ దారిలో నడిచే అవకాశం లేకపోలేదు.

ఇటీవల విడుదలైన మసూద ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. హారర్ సినిమాకి కమర్షియల్ యాంగిల్స్ ని జోడించి దర్శకుడు ప్రేక్షకులను థ్రిల్ చేశారు. దెయ్యం కాన్సెప్ట్‌ తో వచ్చిన సినిమా లిస్ట్ తో చేరింది మసూద. దయ్యం పట్టిన కూతురు కోసం కష్టపడే అమ్మ కథే మసూద.

దెయ్యం కాన్సెప్ట్‌ సినీ ఇండస్ట్రీ కి హిట్ ఫార్ములా. ఆత్మలు,దెయ్యాల కథలు అనేవి ఎప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు రాల్చే ఫార్ములానే. కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళితే కొంగర జగ్గయ్య గారు అర్ధరాత్రి అనే సినిమాలో నటించారు. దాదాపు అప్పటి నుంచి దెయ్యం కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధించాయి. పాన్ ఇండియా స్థాయిలో కన్నడ చిత్రాల జోరుని కొనసాగించిన ‘విక్రాంత్‌ రోణ’ చిత్రం కూడా దాదాపు ఇదే కాన్సెప్టుతో వచ్చింది. తెలుగు నాటనే కాదు తమిళ మలయాళ నాట కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. మమ్ముట్టి రోషాక్ కూడా దాదాపు ఇదే పథంలో ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -