Hotel AN: మహేష్ హోటల్‌లో పునుగుల రేటు ఎంతో తెలుసా?

Hotel AN: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్‌ గా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఊహించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. కానీ మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో.. షూటింగ్‌ను నిలిపివేశారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగాల్లో మహేష్ బాబు దూసుకెళ్తున్నారు. ఏషియన్ గ్రూప్‌తో కలిసి డిసెంబర్ 8వ తేదీన హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశారు. ఈ రెస్టారెంట్‌కు మహేష్ బాబు తన భార్య నమ్రత పేరు పెట్టారు. ‘ఏఎన్’ అని నామకరణం చేశారు. ఏ అంటే ఏషియన్స్ అని, ఎన్ అంటే నమ్రత అని తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ భవనం పక్కనే ఉంది.

 

గ్రాండ్‌గా ఓపెన్ అయిన ఈ ఫుడ్ రెస్టారెంట్‌లో ధరలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఫుడ్ ఐటమ్స్ ధరలు ఓ రేంజ్‌లో ఉందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏఎన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ధరల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టిఫిన్స్: ఇడ్లీ రూ.90, ప్లైన్ దోశ రూ.150, మసాలా దోశ రూ.190, ఆనీయన్ రవ్వ దోశ రూ.205, వడ రూ.140, పునుగులు రూ.125, ఉప్మా రూ.120గా ఉన్నాయి. టిఫిన్స్ కే ఈ ధరలుంటే.. మిగిలిన ఐటమ్స్ కు ఏ రేంజ్‌లో ధరలుంటాయోనని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం క్వాలిటీ, రెస్టారెంట్ బ్రాండ్‌కు బట్ట రేట్లు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.

 

అయితే రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. రెస్టారెంట్ లుక్, డిజైనింగ్, ఫర్నిచర్ అదిరిపోయిందని, ఫైవ్ స్టార్ హోటల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలతోపాటు బిజినెస్‌లో బాగా రాణించాలని కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 టైటిల్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమానే పూర్తిగా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. స్టోరీ నచ్చకపోవడంతో.. ఆ కథలో కొన్ని మార్పులు చేయాలని మహేష్ బాబు సూచించారట. అప్పుడు సినిమా స్టార్ట్ చేద్దామని మహేష్ బాబు చెప్పినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -