40 Wives: ఒకే వ్యక్తికి ఏకంగా 40 మంది భార్యలట.. ఎంత లక్కీనో?

40 Wives: ప్రస్తుత కాలంలో ఒక భార్య ఇద్దరు పిల్లలను పెంచి పోషించడం ఎంతో కష్టతరంగా మారింది.పెరిగిన ధరలను బట్టి ప్రస్తుత కాలంలో ఒక భార్య ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగించడం చాలా కష్టతరంగా మారింది. ఇలా ఇద్దరు పిల్లలను పోషించాలి అంటే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒక భార్య ఇద్దరు పిల్లలు గగనం అనుకుంటే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 40 మంది మహిళలకు మొగుడు అయ్యారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం మరి ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే విషయానికి వస్తే…

బీహార్ ప్రభుత్వం తాజాగా కుల గణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ప్రభుత్వ అధికారులు బీహార్ లోని, ఆర్వాల్ జిల్లాలోని వేశ్యావాటికకు వెళ్లిన సిబ్బంది సర్వే చేస్తుండగా ఏ ఇంటికి వెళ్లిన మహిళలు తమ భర్త పేరు రూప్ చంద్ అని చెబుతున్నారు. ఇలా ఏకంగా 40 మంది మహిళలు ఈయన పేరు చెప్పడంతో ఒక్కసారిగా అధికారులు కంగుతిన్నారు. అక్కడ ఎవరిని పలకరించిన వైఫ్ ఆఫ్ రూప్ చంద్,డాటర్ ఆఫ్ రూప్ చంద్, సన్నాఫ్ రూప్ చంద్ అని సమాధానం చెబుతున్నారు.

 

ఇలా ఒక వ్యక్తి 40 మందిని పెళ్లి చేసుకున్నారా అంటే లేదు. వారు వెళ్ళింది. ఒక రెడ్ లైట్ ఏరియాకి అక్కడ మహిళలందరూ కూడా సెక్స్ వర్కర్లు కావడంతో రూప్‌చంద్‌ అనే స్థానిక డ్యాన్సర్‌ను భర్తగా ఎంచుకున్నారు.అతను నిజంగా ఎవరిని పెళ్లి చేసుకోలేదు కనీసం కొంతమంది ఆయన మొహం ఎలా ఉంటుందో కూడా చూడలేదని చెప్పారు.

 

రూప్‌చంద్ పేరులో ఇంకో ట్విస్ట్ ఉంది. అక్కడి సెక్స్ వర్కర్లు డబ్బును ‘రూప్‌చంద్’ అని పిలుస్తారట.ఇక ఈ గల్లీలోని రూప్ చంద్ అనే వ్యక్తి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ తానే మొగుడు అయ్యారు. కానీ ఆయనకు కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదని తెలుస్తుంది. ఇక సర్వే విషయానికి వస్తే అక్కడి అసలు ఆడవాళ్లకు కులమే లేదట వారు ఏ కులం వ్యక్తి వచ్చిన ఆ కస్టమర్ పట్ల వివక్ష చూపబోమని తమకు ఏ కులము లేదు అంటూ తెలియచేయడం గమనార్హం.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -