Tollywood: టాలీవుడ్ స్టార్స్ సినిమాలలో ఏ సినిమా హక్కులు ఎంతంటే?

Tollywood: ఈ మధ్యకాలంలో సినిమాల డిజిటల్ హక్కులు ఔరా అనిపిస్తున్నాయి. అయితే అన్ని సినిమాలకు ఇదే పరిస్థితి లేదు. క్రేజీ కాంబినేషన్ ఉన్న సినిమాలకు మాత్రమే ఎక్కువగా ఇది సాధ్యమవుతోంది. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రేట్ల బేరాలు వింటుంటే షాక్ కొట్టినట్లే ఉంటోంది.నాన్ థియేటర్ రేట్లు పెరుగుతున్న కొద్దీ హీరోల రెమ్యూనరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చు పెరుగుతూ పోతోంది. అంటే రేట్లు వస్తున్నాయన్న సంబరమే కానీ నిర్మాతలకు అది లెక్కలే తప్ప పెద్దగా లాభాలు రావడం లేదు.

ఇకపోతే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 డిజిటల్ రేట్ ను 200 కోట్ల దగ్గర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేజిఎఫ్ 2, షారూఖ్ ఖాన్ పఠాన్ కన్నా ఇది చాలా అంటే చాలా ఎక్కువ. అందుకే నెట్ ఫిక్స్ సంస్థ ఇంకా ఈ మూవీ విషయంలో బేరసారాలు సాగిస్తోంది. 150 నుంచి 160 దగ్గర అయితే ఫైనల్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే మహేష్ – త్రివిక్రమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కలు అత్యంత భారీగా 80 కోట్ల కు అటు ఇటు చేసి విక్రయించినట్లు తెలుస్తోంది.

 

అంతే కాదు డీజే టిల్లు 2 డిజిటల్ రైట్స్ కూడా భారీగా కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన సలార్, ప్రాజెక్ట్ కే లాంటి భారీ సినిమాల డిజిటల్ రైట్స్ ని కూడా భారీ ధరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ – మైత్రీ – పవన్ సినిమా డిజిటల్ రైట్స్ ఎప్పుడొ జమానా కాలం నాడు నిర్మాతలు విక్రయించేసినట్లు తెలుస్తోంది. మరో రెండు చిన్న సినిమాలతో కలిపి జస్ట్ 20 కోట్లకే ఇచ్చేసారు అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే తాజాగా విడుదల అయిన దసరా సినిమాకు నాన్ థియేటర్ హక్కులు యాభై కోట్ల వరకు వచ్చి, నిర్మాతను చాలా వరకు ఆదుకున్నాయి. రంగమార్తాండ సినిమాకు కూడా 11 కోట్ల వరకు ఖర్చయితే డిజిటల్ హక్కులే ఆరు కోట్లకు పైగా వచ్చి నిర్మాతను కాస్త నిలబెట్టాయి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -