Bunny: ఆ తప్పు వల్ల బన్నీ ఎంతగానో బాధ పడుతున్నారా?

Bunny: మనిషి అన్నాక తప్పులు చేయడం మామూలే. అయితే అది తప్పని తెలిసి కొందరు మళ్లీ అదే తప్పు చేస్తుంటారు. అలాంటివారిని ఎవ్వరూ పట్టించుకోరు. కొందరైతే క్షమించరు కూడా. సామాన్య ప్రజలకంటే సెలబ్రిటీలు చేసే తప్పులు అందరికీ వెంటనే తెలిసిపోతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు కూడా తాము చేసిన తప్పులను ఆ తర్వాత సరిదిద్దుకుని ముందుకు వెళ్తుంటారు. అలాంటి కోవకు చెందినవారే అల్లు అర్జున్.

 

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ డాడీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో బన్నీ తన నటనతో పర్లేదనిపించాడు. రెండో సినిమాగా బన్నీని చేసి ఆ తర్వాత తన పేరును ఏకంగా బన్నీ అనే మార్చుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టైలిష్ స్టార్ వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పాలి. అయితే కెరియర్ పరంగా మాత్రం ఆయన ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు.

 

కెరియర్ పరంగా బన్నీ తీసుకున్న తప్పుడు నిర్ణయం కాస్త బ్రేక్ వేసిందనే చెప్పాలి. 2010లో మార్చి 31వ తేదిన బన్నీ హీరోగా వరుడు సినిమా చేశాడు. అయితే ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. బన్నీ సినిమాల ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ గుణ శేఖర్ ఓవర్ యాక్టింగ్ చాలా మందికి కోపాన్ని కూడా తెప్పించింది.

 

హీరోయిన్ ని దాచి పెట్టేసి కనీసం ఆడియో ఫంక్షన్ కూడా డైరెక్టర్ గుణ శేఖర్ రానివ్వలేదు. హీరోయిన్ ను అందరూ థియేటర్స్ లోనే చూడాలని చిత్ర యూనిట్ ఒక పోస్టును కూడా రిలీజ్ చేయలేదు. ఆ టైంలో సినిమాపై నెగిటివ్ టాక్ కూడా ఎక్కువయ్యింది. అయితే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” అనే సినిమా విషయంలో కూడా బన్నీ అదే తప్పు చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో బన్నీ పుష్ఫ2 సినిమాతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. అయితే ఇకపై అటువంటి తప్పులు చేయకుండా బన్నీ ముందుకు దూసుకెళ్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -