Munugode: మునుగోడులో ఇప్పటివరకు ఎంత డబ్బులు, బంగారం పట్టుబడిందో తెలుసా?

Munugode: మునుగోడు ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయడంతో ఈ ఉపఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో కీలకంగా మారింది. ఈ ఉపఎన్నిక ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది కనుక మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. పార్టీలన్నీ గెలుపు కోసం తమవంతు ప్రయత్నాలు చేశాయి.

 

ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. విమర్శలతోనే కాదు ఏకంగా భౌతిక దాడులు దిగడం రచ్చకు దారి తీసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, స్రవంతి రెడ్డిలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో కాక రేపింది. అయితే మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో.. పార్టీలన్నీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశాయి. ఓటుకు రూ.3 వేల వరకు పంపిణీ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. డబ్బులతో పాటు మద్యం సరఫరా చేస్తోన్నారు. ఇంటింటికి వెళ్లి డబ్బులతో పాటు మద్యం బాటిళ్లు ఇస్తున్నారు.

 

మునుగోడు ఉపఎన్నిక క్రమంలో ఇప్పటివరకు రూ.8.20 కోట్ల విలువైన డబ్బులు, మద్యం, బంగారం సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ వేళ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని, తనిఖీలు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడులో ప్రతి గ్రామంలో తనిఖీలు చేశామని, కల్యాణ మండపాలతో పాటు అన్నింటినీ చెక్ చేసినట్లు స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 

అయితే మునుగోడు ఉపఎన్నికలో ధనప్రవాహం ఏరులై పారింది. నియోజకవర్గంలో సాయంత్ర అయితే ఎక్కడికక్కడ పార్టీలన్నీ యువకులకు దావత్ లు ఏర్పాటు చేశాయి. కొన్నిచోట్ల బంగారం కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. తులం బంగారం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా తులం బంగారం ఇస్తున్నారంటే మునుగోడు ఉపఎన్నికను పార్టీలన్నీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో తెలుస్తోంది. కొన్నిచోట్ల తమకు డబ్బులు అందలేందటూ కొంతమంది ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు తులం బంగారం ఇస్తామని చెప్పి చివరికి రూ.3 వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయారంటూ పార్టీల నేతలను నిలదీస్తున్నారు.

 

పార్టీలన్నీ పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేశాయి. ఒక పార్టీ రూ.3 వేలు ఇస్తే మరో పార్టీ రూ.4 వేలు ఇస్తోంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా డబ్బులు సరఫరా చేస్తున్నాయి. అయితే హూజూరాబాద్ లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చారని, ఇక్కడ రూ.3 వేలు ఏంటీ అంటూ కొంతమంది ఓటర్లు పార్టీల నేతలను ప్రశ్నిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక అత్యంత కాస్ట్ లీ ఉపఎన్నిక అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ హుజూరాబాద్ లో పోలిస్తే తక్కువేననే మాటలు వినిపిస్తోన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండటంతో.. మునుగోడులో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలన్నీ తామే గెలుస్తామంటూ చెప్పకొస్తోన్నాయి. దీంతో ఎవరు గెలుస్తారనేది 6వ తేదీనే తెలియనుంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -