Weight Loss: అలా చేస్తే ఎలాంటి చికిత్స లేకుండా బరువు తగొచ్చు!

Weight Loss: ప్రస్తుత కాలంలో వయస్సు బేధం లేకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్‌తో సతమతమవుతుంటారు. స్థూలకాయం తగ్గించేందుకు చాలా మార్గాలున్నా బరువు ఎప్పుడూ ఆరోగ్యకరంగానే తగ్గాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
లేకపోతే మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో స్థూలకాయం లేదా మరికొందరిలో బెల్లీ ఫ్యాట్‌ అతిపెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు.

డైటింగ్ వర్‌ఔట్‌లు చేయడం ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేస్తుంటారు. ఒకవేళ కొన్ని పద్ధతులు బరువును తగ్గించే కలిగినా అది ఆరోగ్యకరంగా సాగకపోతే, అనారోగ్యం వెంటాడుతుంటుంది. అందుకే బరువు తగ్గడమనే ప్రక్రియ ఎప్పుడూ ఆరోగ్యకరంగా సాగాలి తప్ప అసహజంగా ఉండకూడదు. అంటే బరువు తగ్గించుకోవడమనేది సహజ సిద్ధంగా జరగాలి. కృతిమ పద్ధతుల్లో జరిగితే అనారోగ్యం వెంటాడుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలంటే పెరుగు అద్భుత ఔషధ మంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

 

దీన్ని డైట్‌లో చేర్చుకుంటే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలుంటాయి. పెరుగు సహజసిద్ధంగా బరువు తగ్గించే అద్భుతమైన ఔషధం. ఇది ఒక ప్రో బయోటిక్‌ ఫుడ్‌ శరీరంలోని కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది. పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్‌ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి, మెటబోలిజంను వృద్ధి జరుగుతుంది. మెటబోలిజం ఎప్పుడైతే మెరుగ్గా ఉంటుందో సహజంగానే బరువు తగ్గుతారు. పెరుగులో ఉండే ప్రోటీన్ల కారణంగా కడుపు నిండినట్టు ఉండి.. ఆకలేయదు. పెరుగు నేరుగా తినడం ఇష్టం లేకపోతే.. కొద్దిగా నల్ల మిరియాల పౌడర్‌ చల్లుకుని తాగవచ్చు.

బెల్లీ ఫ్యాట్‌ సమస్య నుంచి విముక్తి పొందేందుకు పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం పెరుగును ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌లో క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తిండిపై కోరిక తగ్గి.. నెమ్మదిగా బరువు నియంత్రణలో ఉంటుంది. రుచి కోసం, పోషకాల కోసం పెరుగుతో పాటు డ్రై ఫ్రూట్స్‌ చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకుని తాగితే ఇంకా మంచిది. అంతేకాదు.. శరీరంలో వివిధ కారణాల వల్ల వేడెక్కితే అంటే వేడి చేస్తే పెరుగు నియంత్రిస్తుంది. పెరుగు, మజ్జిగ అనేవి చలువ చేసే పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Vanga Geetha: వైసీపీ వంగా గీతకు ప్రజల్లో తిరస్కారం వెనుక అసలు లెక్కలివేనా.. ఏం జరిగిందంటే?

Vanga Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాపు...
- Advertisement -
- Advertisement -