Hyderabad: సైబర్ మోసం.. గూగుల్‌లో సెర్చ్ చేసింది.. రూ.47 లక్షలు పోగొట్టుకుంది!!

Hyderabad:  సైబర్ నేరగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజుకో కొత్త పంథాతో పోలీసులకు సవాల్‌గా మారుతున్నారు. కొత్త కొత్త దారులను ఎంచుకుంటూ సామాన్యులను మోసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లక్కీ డ్రాలు, కూపన్లు, ఫేక్ వెబ్‌సైట్ లింక్స్, ఆన్‌లైన్ షాపింగ్ ఇలా ప్రజలకు ఎరగా వేసి.. డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి.. భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. అందుకు పోలీసులు సైతం సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ నేరగాళ్లు ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ డబ్బులు లూటీ చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. సైబల్ నేరగాళ్ల చేతిలో ఓ మహిళ దారుణంగా మోసపోయింది. పూజల పేరుతో మహిళను ట్రాప్ చేశారు. ఆమె దగ్గరి నుంచి దాదాపు రూ.47 లక్షలు కాజేశారు. అయితే ఈ ఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఈ మహిళ తనకున్న సమస్య ఎలా తొలగిపోవాలని గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవాలని ప్రయత్నించింది. దీంతో ఆమెకు హర్యానాకు చెందిన ఓ బాబా ఫోన్ చేశాడు.

మహిళకు ఫోన్ చేసి.. ఆమె సమస్యను పూర్తిగా తెలుసుకున్నాడు. ఆమెకున్న పూర్తి సమస్యలు తీరుస్తానని, కొన్ని పూజలు చేయాలని నమ్మించాడు. అలా ఆమెకు నమ్మించి సమస్య తీరడానికి పూజలు చేస్తున్నట్లు మహిళకు ఫోటోలు కూడా పంపించాడు. విడతలవారీగా పూజలు చేస్తూ డబ్బులు తీసుకున్నాడు. అలా ఏకంగా సుమారు రూ.47 లక్షలు వసూలు చేశాడు. అయితే డబ్బులు తీసుకున్నా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో బాబాపై మహిళకు అనుమానం వచ్చింది.

దీంతో మహిళ బాబాకు ఫోన్ చేసింది. ఎన్ని సార్లు కాల్ చేసినా.. బాబా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తాను మోసపోయినట్లు మహిళ గ్రహించింది. దీంతో మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

ట్రేండింగ్

Balakrishna: బాలయ్య కెరీర్ లో చిక్కుకున్న వివాదాలివే.. నీ బ్లడ్, బ్రీడ్ అప్పుడైమైందంటూ?

Balakrishna: బాలయ్య విచిత్రమైన మెంటాలిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. అలాగే మొన్న అసెంబ్లీలో కూడా తనకి ఇష్టం వచ్చినట్లు చేసి సభా...
- Advertisement -
- Advertisement -