Balakrishna-Chandrababu: బాలయ్య టాక్ షోకు చంద్రబాబు.. ఆయనలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారా?.. ఆ విషయాలపై మాట్లాడతారా?

Balakrishna-Chandrababu: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌ గెస్ట్‌గా మోహన్ బాబు రాగా.. సెకండ్ సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన షూట్ కూడా అయిపోయింది. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు సెట్‌లోకి ఎంటర్ కాగానే.. అక్కడ ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు చూసిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు తనయుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కూడా మధ్యలో జాయిన్ అవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ తొలి సీజన్‌లో మొత్తం సినీ సెలబ్రిటీలను తీసుకురాగా పెద్దగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఇప్పుడు సెకండ్ సీజన్‌లో తొలి ఎపిసోడ్‌లోనే చంద్రబాబును గెస్ట్‌గా తీసుకురావడంతో సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాలు కూడా ఈ ఏపిసోడ్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్‌లో సరదా అంశాలతో పాటు.. కొన్ని సీరియస్‌ అంశాలను ప్రస్తావించనున్నారనే ప్రచారం జరుగుతంది. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 2పై అంచనాలు మరింతగా పెరిగాయి.

అన్ స్టాపబుల్ తొలి సీజన్‌లో మోహన్ బాబు గెస్ట్‌గా వచ్చిన మొదటి ఎపిసోడ్‌లో.. ఆయన చంద్రబాబు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు తన విషయంలో తప్పు చేశారని.. అది ఇక్కడ చెప్పడం సబబు కాదని అన్నారు. ఎన్టీఆర్ స్తాపించిన పార్టీ పగ్గాలు ఆయన వారసులుగా మీరు తీసుకోకుండా.. చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం ద్వారా మోహన్ బాబు. బాలకృష్ణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతన్నందుకే అప్పుడు తీసుకోలేదనే సమాధానమిచ్చారు.

ఇలాంటి టాక్ షోలో.. ఇప్పుడు చంద్రబాబు షోలో ఎలాంటి విషయాలు పంచుకుంటన్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో చంద్రబాబు పెద్దగా సినిమా ఫంక్షన్లలో కనిపించిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి. గతంలో మంచు లక్ష్మీ హోస్ట్‌గా చేసిన టాక్ షోకు చంద్రబాబు హాజరయ్యారు. 2014లో హుదూధ్ తుఫాన్ బాధితుల సహాయార్థం టాలీవుడ్ అంతా కలిసి నిర్వహించిన మేము సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీలో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంపైనే పూర్తిగా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు టాక్ షోలో ఏం మాట్లాడతారనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఈ షోలో చంద్రబాబు తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తే.. ఆయనలోని మరో కోణం జనాలకు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే పొలిటికల్ కూడా తనపై ఉన్న కొన్ని రిమార్క్స్‌పై.. ఈ వేదికగా స్పందిస్తే ప్రజల్లోకి బాగా వెళ్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే మోహన్ బాబు తనపై చేసిన కామెంట్స్‌పై కూడా ఏమైనా స్పందిస్తారా? అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇటీవల మోహన్ బాబు స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయిన నేపథ్యంలో.. అలాంటి వాటిపై ఆయన స్పందించే అవకాశం ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. షో హోస్ట్ కూడా బాలకృష్ణ కావడంతో.. ఈ ఎపిసోడ్ టీడీపీ పొలిటికల్ ప్రమోషన్స్‌కు ఉపయోగపడుతుందనే టాక్ వినిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -