Automobiles: వామ్మో.. భారీగా పెరిగిన ఆటోమొబైల్ సేల్స్.. ఎంతంటే?

Automobiles: గ‌డిచిన నాలుగేళ్ల‌తో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజ‌న్‌లో ఆశించిన బిజినెస్ జ‌రిగింద‌ని ఆటోమొబైల్ డీల‌ర్స్ అసోసియేష‌న్స్ ఫెడ‌రేష‌న్ అంచ‌నా వేస్తుంది.  గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌లో 14,18,726 వెహిక‌ల్స్ రిజిస్ట్రేష‌న్ న‌మోదైతే.. గ‌త నెల‌లో 20,94,378 యూనిట్ల రిజిస్ట్రేష‌న్ పెరిగిన‌ట్లు వారు చెబుతున్నారు. ప్రీ-కొవిడ్‌తో పోలిస్తే కొవిడ్ త‌రువాత ఎనిమిది శాతానికి పైగా ఎక్కువ కార్లు, టూ వీల‌ర్స్ అమ్ముడ‌యిన‌ట్లు తెలుస్తుంది. కేవ‌లం కార్లు, టూ వీల‌ర్స్ మాత్ర‌మే కాకుండా మిగ‌తా క్యాట‌గిరీ వెహిక‌ల్స్ కూడా సేల్స్ కూడా రికార్డుస్థాయిలో న‌మోద‌య్యాయి.

 

 

అమాంతం పెరిగిన సేల్స్‌:

 

గ‌తేడాది  2,33,822 యూనిట్ల కార్లు అమ్ముడైతే ఈ ఏడాది ఆ సంఖ్య 41 శాతం పెరిగి 3,28,645 యూనిట్ల‌కు చేరింది. టూ వీల‌ర్స్ సేల్స్ అయితే 51 శాతం వృద్ధితో దూసుకుపోతుంది. వాణిజ్య వాహ‌నాల సేల్స్ కూడా 25 శాతం పెరిగాయి. త్రీ వీల‌ర్స్ సేల్స్ 66 శాతం, ట్రాక్ట‌ర్ల విక్ర‌యాలు 17 శాతం పెరిగాయి.

 

 

ప్యాసింజ‌ర్ వాహ‌నాలలో ఎస్‌యూవీ మోడ‌ల్ కార్ల‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ల‌భిస్తోంది. కొవిడ్ రాక‌ముందు సేల్స్‌తో పోలిస్తే టూ వీల‌ర్స్‌లో సేల్స్‌లో ఆరు శాతం గ్రోత్ న‌మోదైంది. ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌లు ఒకే నెల‌లో రావ‌డంతో ఆటో డీల‌ర్ షాప్‌ల‌కు వ‌చ్చిన సంద‌ర్శ‌కుల సంఖ్య కూడా రెట్టింపైన‌ట్లు ఫాడా ప్రెసిడెంట్ మ‌నీశ్ రాజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

 

 

ఈ పండ‌గ సీజ‌న్‌లో 29 శాతం సేల్ గ్రోత్ న‌మోద‌య్యింది. ఈ స‌మ‌యంలో కార్ల విక్ర‌యాలు 34 శాతం, టూ వీల‌ర్స్ సేల్స్ 26 శాతం, త్రీ వీల‌ర్స్ 68, క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ 29, ట్రాక్ట‌ర్స్ సేల్స్ 30 శాతం మేరా పెరిగి కంపెనీల‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -