భార్య దెబ్బలకి చెట్టు ఎక్కిన భర్త.. నెల రోజులుగా అక్కడే!

సాధారణంగా మనం భార్య భర్తల గొడవలు చూస్తూనే ఉంటాం. ఇది సహజంగా ప్రతి ఒక్కరి జీవితాలలో జరిగేదే. కొంతమంది భర్తలు తాగి భార్య లను కొట్టడం, కొన్ని వివాదాల కారణంగా భార్య లను కొట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుత కాలం అలా లేదు. అంత తారుమారైంది. భర్తలు భార్య లను కొట్టడం కాదు, భార్య లే భర్త లను కొడుతున్నారు. భర్త లను వేధిస్తున్నారు. భర్తలను మానసిక ఒత్తిడి కి గురి చేస్తున్నారు.

అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ భార్య ఇదే చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని కోపగంజ్ అనే గ్రామం లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన లో ఓ భార్య తన భర్త ను కొడుతుంది అని భర్త ఏకంగా, 100 అడుగుల తాటి చెట్టు ఎక్కేసాడు. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజులు చెట్టు మీదే మకాం వేశాడు ఈ ఉత్తర ప్రదేశ్ లోని కోపగంజ్ కు చెందిన రామ్ ప్రవేశ్.

తన బంధువులు అతడికి చెట్టు మీదికే నెల నుంచి తాడు సహాయం తో ఆహారాన్ని అందజేస్తున్నారు. ఎంత మంది బ్రతిమాలిన అతడు కిందకి దిగలేదు. అయితే గ్రామస్థులు ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో చూడడానికే ఎక్కాడని పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చెయ్యగా పోలీస్ లు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ లు కూడా ఎంతో ప్రయత్నించిన ఏం లాభం లేదు.

అప్పటికి కూడా అతడు కిందకి దిగలేదు. ఎంతో ప్రయత్నించి పోలీస్ లు కూడా విఫలమయ్యారు. ఎంతటికీ ఆయన కిందకి దిగపోయేసరికి పోలీస్ లు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అతడిని కిందకి దింపాలి అంటే చెట్టును కోసెయ్యలి. లేదా భార్య భయం తో ఉన్నాడు కాబట్టి దేవుడే దిగి రావలేమో అని జనాలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతడు వార్తల్లో నిలిచాడు. ఇతడు ఎప్పుడూ కిందకి దిగుతాడు అని చాలా మంది వేచి చూస్తున్నారు. ఒకప్పటి చెట్టులెక్కగలవ ఓ నర హరి పుట్టలెక్కగలవా.. అన్న పాటను గుర్తు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -