కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో పదికాలాలపాటు ఎంతో పచ్చగా సాగిపోవాల్సిన కాపురాలు ఎన్నో అనుమానాలతో ఇతర వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని స్వయంగా చేతులారా పాడు చేసుకుంటున్నారు. కొందరు అనుమానాలు మనస్పర్ధలు కారణంగా దారుణాలకు పాల్పడుతుంటే మరికొందరు వరకట్న వేధింపులకు బాధపడుతూ పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజుకి అధికమవుతుంది.

ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన తాజాగా ఏపీలో మరొకటి చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఒకటవ వార్డులో నాగరాజు, విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు వీరిద్దరూ 15 సంవత్సరాల క్రితమే పెద్దలను ఎదిరించి వీరి కులాలు వేరైనా ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఓ కుమారుడు కుమార్తె జన్మించగా కుమారుడు గతంలోనే మరణించడంతో కుమార్తె ఆలనా పాలన చూసుకుంటూ ఎంతో సంతోషంగా వీరి జీవనం కొనసాగుతోంది.

నాగరాజు ఫుడ్ కార్పొరేషన్ సంస్థలో కూలి పని చేస్తుండగా విజయలక్ష్మి టైలరింగ్ పనిచేస్తూ వీరి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.అయితే వీరి వివాహం జరిగిన 15 సంవత్సరాలకు నాగరాజు ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాగరాజు తరచు తన భార్య విజయలక్ష్మిని అనుమానిస్తూ తనను ప్రశ్నించేవాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు చోటు చేసుకున్నాయి.

అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ దంపతుల మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకోవడమే కాకుండా ఈ గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసింది.ఇలా భార్యపై అనుమానం పెంచుకున్నటువంటి నాగరాజు తన భార్య విజయలక్ష్మి ఏదో పనిలో నిమగ్నమైన సమయంలో వెనుక నుంచి రాడ్ తో తలపై గట్టిగా బాదాడు. దీంతో విజయలక్ష్మికి తీవ్ర రక్తస్రావం కావడమే కాకుండా అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి భర్త నాగరాజు పై కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -