Husband-Wife: పెళ్లైన నెలకే భర్తను లేపేసింది.. నాలుగేళ్ల తర్వాత అసలు నిజం బయటకు!

Husband-Wife: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. వీరి సంబంధానికి భర్త అడ్డుగా కనిపిస్తున్నాడని అమాయకులను బలి చేస్తున్నారు కొందరు మహిళలు. కుటుంబాన్ని పోషించాలని వివిధ రకాల పనులు, ఉద్యోగాల్లో భర్త నిమగ్నమైతే మరో వ్యక్తితో రంకు నడుపుతున్న కొందరు ముదురు మహిళలు. ప్రియుడిని విడిచి ఉండలేక అడ్డుగా ఉన్న భర్తనే లేకుండా చేస్తున్నారు. తమిళనాడులో నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ తరహా ఘటన నిజాలు ఇటీవల బయటపడ్డాయి.

 

అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని తుత్తుకూడి ప్రాంతంలో అనిత అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. అక్కడే అంథోణి అనే యువకుడు కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బాగా పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి కొన్ని రోజులు ఎంజాయ్‌ చేస్తూ వచ్చారు. అలా కొన్నాళ్ల తర్వాత కూతురు ప్రేమ విషయం అనిత తల్లిదండ్రులకు తెలిసింది. పైగా ప్రియుడి కులం వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు అతనితో పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలోనే అనిత తల్లిదండ్రులు తుత్తుకూడికి చెందిన కధివరన్‌ అనే సాప్ట్‌ వేర్‌ ఉద్యోగితో అనితకు 2018లో వివాహం జరిపించారు.

 

ఇక పెళ్లైన నాటి నుంచి అనిత కధివరన్‌ తో అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చింది. పెళ్లైన కొత్తలొ కదా అలాగే ఉంటుందని కధివరన్‌ మౌనంగా ఉంటూ వచ్చాడు. పెళ్లై నెల గడిచిన తర్వాత అనిత భర్తతో సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ బీచ్‌ వెళ్తామని కోరడంతో కధిరన్‌ తీసుకెళ్లాడు. అంతకు ముందే అనిత భర్తను హత్య చేయాలని ప్రియుడితో ప్లాన్‌ వేసుకుని ఉంది. ప్రియుడి ప్లాన్‌ ప్రకారం భర్తను అనిత బీచ్‌కు తీసుకువచ్చి ఇద్దరు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత అంథణీ అక్కడి నుంచి ఎవరికీ కనపడకుండా జారుకున్నాడు. కాసేపటి తర్వాత అనిత లబోదిబో అంటూ మొత్తుకుంటూ దొంగ ఏడుపు ప్రారంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు చేపట్టగా ఇటీవల అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీచంగా కధివరన్‌ను ఇద్దరు కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కోర్టు ఇద్దరిని యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -