Husband-Wife: భార్య అన్నం పెట్టలేదని 42 ఏళ్లుగా బెట్టు చేస్తోన్న భర్త..ఇలా కూడా ఉంటారా

Husband-Wife: దంపతుల మధ్య గొడవలు సహజమే. అసలు భార్యాభర్తల అన్నా గొడవ కాస్తో కూస్తో పడుతూ ఉండాలి. లేకుంటే సంసార జీవితంలో ఏదో వెలితిగా ఉంటుంది. దాంపత్య జీవనంలో ఒకరి మీద ఒకరు అలగడం ఆ తర్వాత బ్రతిమాలుకోవడం మళ్లీ కలిసిపోవడం ఇవంతా ఎంతో హాయినిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవే వారికి ఒకరిపై మరొకరికి సరైన నమ్మకాన్ని చేకూరుస్తాయి. అయితే కొందరుంటారు. చిన్న చిన్న గొడవల్ని పెద్దది చేసుకుని సంసారాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. మరికొందరు బెట్టు చేస్తారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలానే బెట్టు చేశాడు.

 

భార్య మీద కోపంతో ఓ భర్త బెట్టు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందులో ఆశ్చర్యపడే విషయం ఏముందని అంటారా..అక్కడికే వస్తున్నాను ఆగండి. ఈ భర్త తన భార్య మీద అలిగి ఏకంగా 42 ఏళ్ల పాటు అన్నమే తినడం లేదు. తన కడుపును అటుకులు, టీతోనే నింపుకుంటున్నాడు. అయితే గొడవ పడిన తన భార్యతో మాత్రం మామూలుగానే ఉంటున్నాడు. కానీ తన భార్య చేతి వంట మాత్రం తినకుండా బెట్టు చేస్తున్నాడు. అతని ప్రవర్తనకు అందరూ నోరెళ్లబెడుతున్నారు.

 

జైపూర్ జిల్లాలోని వికీపూర్ గ్రామంలో రామచంద్ర అనే 76 ఏళ్ల వ్యక్తి నివశిస్తున్నాడు. రామచంద్రకు 22 ఏళ్ల వయసులో సీత అనే మహిళను ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరి సంసార జీవితం సాఫీగా సాగింది. అయితే 42 సంవత్సరాల క్రితం ఓ రోజు రామచంద్ర కూలిపని చేసి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో తన భార్యను అన్నం వడ్డించమని కోరాడు. అయితే అక్కడే అసలు సంగతి మొదలైంది.

 

ఒంట్లో బాగోలేకపోవడం వల్ల సీత కాస్త నీరసంగా ఉంది. తన భర్త భోజనం వడ్డించమని అడగ్గానే వంట చేయలేదని చెప్పింది. తన భార్య పరిస్థితిని రామచంద్ర అర్థం చేసుకోకుండా గొడవకు దిగాడు. భార్యపై అలిగి అన్నం తినకుండా మానేశాడు. ఇక ఆ రోజు నుంచి నేటి వరకూ కూడా ఆయన తన భార్య చేసిన వంటను తినలేదు. తనకు ఆకలి అయినప్పుడు కేవలం అటుకులు, టీని మాత్రమే తీసుకుంటూ వస్తున్నాడు. భార్య వంట తినాలని ఎంత మంది చెప్పినా రామచంద్ర వినిపించుకోవడం లేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -