Hyderabad: కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన యువతి.. కానీ అంతలోనే?

Hyderabad: ప్రస్తుత కాలంలో చాలామంది యువత క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా వారి పిల్లలపై ఎన్నో అసలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. చిన్న చిన్న వాటికే యువత వారి ప్రాణాలను తీసుకుంటున్నారు. చదువుకుంటున్న వారు కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక బీటెక్ చదివిన యువతి ఈ విధంగానే క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని సజీవ దహనం అయ్యింది. కూతురు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శిరీష అనే ఒక 22 ఏళ్ల యువతీ తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఇటీవల బీటెక్ పూర్తి చేసిన శిరీష హైదరాబాద్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. శిరీష అనుకున్న విధంగానే ఇటీవల కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద ఉన్న వారి బంధువుల ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత శిరీష కొన్ని రోజుల నుంచి జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ వస్తోంది. ఎప్పుడూ తన బంధువులతో సంతోషంగా గడుపుతూ ఉంటుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ తాజాగా శిరీష ఉంటున్న బిల్డింగ్ పెంట్ హౌస్ లోకి వెళ్ళింది. శిరీష లోపలికి ఒంటరిగా వెళుతూ తనతో పాటు ఒక పెట్రోల్ బాటిల్ కూడా తీసుకెళ్లింది. పెంట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత శిరీష పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది.

 

ఆ విషయాన్ని గమనించిన ఆమె బంధువులు వెంటనే పెయింట్ హౌస్ లోకి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత శిరీషను స్థానిక ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకపోవడంతో అప్పటికే శిరీష మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఇకపోతే కూతురు మరణ వార్త తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు కన్నీరు మున్నూరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -