Hyderabad: సంతోషంతో బయటికి వెళ్లిన యువకుడు.. సీన్ కట్ చేస్తే నడిరోడ్డుపై శవం?

Hyderabad: ప్రస్తుత సమాజంలో చాలామంది చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటుగా కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. రెప్పపాటి కాలంలో నిర్ణయాలు తీసుకొని చంపడం చావడం వరకు కూడా వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఏకంగా ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. తాజాగా ఈ సంఘటన హైదరాబాద్ లోని సైనిక్ పురి సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భూక్యా శివాజీ అలియాస్ శివ అనే 25 ఏళ్ల వ్యక్తి గత కొంత కాలంగా కొరియర్ బాయ్ గా పనిచేస్తున్నాడు.

 

శివ ఓల్డ్ గాస్మండి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తాజాగా ఎప్పటిలాగే ఆదివారం రోజు పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. అనంతరం ఆ రాత్రి ఇంటి పక్కన ఉండే వారి పెళ్లికి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్లాడు. కానీ అతడు పెళ్లికి వెళ్లకుండా సైనిక్ పూరికి చెందిన తన స్నేహితుడు మింటు అలియాస్ డేనియల్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మింటు ఇంటి సమీపంలో ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే అటువైపుగా ఓ యువకుడు వచ్చాడు. అతడిని శివాజీని ఆపి ఈ టైమ్ లో ఇక్కడ ఏం చేస్తున్నావంటూ చేయి చేసుకున్నాడు. దాంతో ఆ యువకుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి బండిలో పెట్రోలో అయిపోయింది తీసుకురమ్మన్నాడు.

 

దాంతో ఆ యువకుడి ఫ్రెండ్ కారులో వచ్చాడు. అయితే మరోసారి శివాజీ వారితో గొడవకు దిగడంతో తమ చేతిలో ఉన్న పూలు కట్ చేసే బ్లేడ్ తో శివాజీపై దాడిచేసి కారులో పారిపోయారు ఆ యువకులు. భయంతో డేనియల్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఉదయం రక్తపు మడుగులో ఉన్న శివాజీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే రాత్రి నుంచి రక్తం కారడంతో శివాజీ అప్పటికే మరణించాడు. దాంతో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే డేనియల్ ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కు వచ్చి జరిగిన విషయం మెుత్తం చెప్పాడు. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు బన్సీలాల్ పేటకు చెందిన పూల వ్యాపారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -