Hyper Aadi: ‘నా దగ్గర పులిహోర కలపొద్దు’ హైపర్ ఆదికి కొత్త యాంకర్ వార్నింగ్

Hyper Aadi: ప్రముఖ టెలివిజన్ చానల్‌లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ షోలో వరుసగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’కు దూరమయ్యారు. వరుస సినిమాలతో ఊపిరిసలపనంత బిజీగా ఉండటంతో ఆమె షోకు గుడ్ బై చెప్పారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అనసూయ బాటలోనే యాంకర్ రష్మీ కూడా ‘జబర్దస్త్’కు బైబై చెప్పేశారు.

రష్మీ స్థానంలో మరో కొత్త యాంకర్ ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె పేరు సౌమ్య. అయితే సౌమ్య ఏస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారోననేది ఆసక్తికరంగా మారింది. కానీ తాజాగా విడుదలైన ‘జబర్దస్త్’ ప్రోమో ఈ అనుమానాలను పటాపంచలు చేసింది. రాగానే అందరి దృష్టిని ఆకర్షించే విధంగా సౌమ్య హంగామా చేశారు.

 

సౌమ్య దిమ్మతిరిగే కౌంటర్
ఈ నెల 17న ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించి విడుదలైన ప్రోమో వైరల్ అవుతోంది. హైపరి ఆది ఎప్పటిలాగే సెటైర్లు వేస్తూ కొత్త యాంకర్ ను ఆటపట్టించే ప్రయత్నం చేశారు. అయితే ఆది పంచ్ లకు రష్మీ గతంలో బాగా బుక్కయ్యే వారు. కానీ యాంకర్ సౌమ్య మాత్రం హైపర్ ఆది గాలి తీసేశారు. తనను కెలికే ప్రయత్నం చేసిన ఆదికి.. సౌమ్య దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

 

చిరంజీవి కాదుగా..
ప్రోమోలో యాంకర్ సౌమ్య బుట్ట బొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. హైపర్ ఆది ఆమె వద్దకు వెళ్లి ‘నువ్వు ఒక్కదానివే డ్యాన్స్ చేస్తే ఒట్టి బొమ్మ అవుతుంది.. నాతో కలసి చేస్తే బుట్టబొమ్మ అవుతుందని’ చెప్పారు. దీనికి యాంకర్ సౌమ్య సమాధానం ఇస్తూ.. ‘మీరు ఎంత పులిహోర కలిపినా నేను మీకు పడను’ అని జవాబిచ్చారు. అయితే ‘ఇదే నా ఛాలెంజ్.. నేను చిరంజీవి అభిమానిని తెలుసా’ అని ఆది అంటారు. దీనికి సౌమ్య ‘చిరంజీవివి కాదుగా అంటూ’ గాలి తీసేసి అందరినీ నవ్వించారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -