Hyper Aadi: ఛీ పోరా అంటూ చిరాకుపడిన సౌమ్యారావు.. ఆది వేస్ట్ అంటూ?

Hyper Aadi: బుల్లితెర కామెడీ షో.. జబర్దస్త్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ షోలో యాంకర్స్ పై పంచ్‌ల సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే హైపర్ ఆది టీమ్ లీడర్ అయ్యాక.. ఈ ట్రెండ్ మరీ ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. తన స్కిట్‌లో భాగంగా యాంకర్‌లను కూడా యాడ్ చేసుకునేవాడు. అలా వారిపై పంచులు కూడా వేసేవాడు. అయితే ఒక్కోసారి ఆ పంచులు హద్దులు దాటేవి. అయినా ఈ విషయాన్ని అక్కడే వదలేసేవారు. యాంకర్ అనసూయ జబర్దస్త్ షో మానేసిన విషయం తెలిసింది. షోలో కొనసాగేటప్పుడు అనసూయ నానా కష్టాలు పడింది. బాడీ షేమింగ్‌కు గురి చేశారని ఆమె ఆరోపించారు. బజర్దస్త్ షో మానేయడానికి ఇది కూడా ఒక కారణమన్నారు.

 

 

అప్పట్లో అనసూయపై కూడా ఓ రేంజ్‌లో పంచెస్ వేసే వాడు ఆది. స్టేజ్‌పైనే రొమాన్స్ చేస్తూ స్కిట్‌లో భాగం చేసేవాడు. అనసూయ కూడా దానికి కో-ఆపరేట్ చేసేది. కానీ షో నుంచి బయటికి వచ్చాక.. ఆమె పడ్డ ఇబ్బందులను బయటపెట్టింది. అనసూయ స్థానంలో కొత్త యాంకర్ సౌమ్యరావు వచ్చింది. ఆమెను కూడా హైపర్ ఆది సెగలు తగ్గుతున్నాయి. దాంతో భాషపై పట్టు లేని సౌమ్యరావు కూడా నానా ఇబ్బంది పడుతోంది. తాజాగా ముద్దు పెట్టమని అడుగుతూ ఆది ముందుకెళ్లాడు. దాంతో సౌమ్య.. ఛీపోరా అంటూ నెట్టేసింది. తాజాగా జబర్దస్త్ విడుదల చేసిన ఎపిసోడ్‌లో హైపర్ ఆది మరింతగా రెచ్చిపోయాడు. కామెడీ పేరుతో హైపర్ ఆది యాంకర్ సౌమ్యరావును ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. సౌమ్యరావును బలవంతంగా తన స్కిట్‌లో ఇన్వాల్ చేస్తున్నట్లు సమాచారం జరుగుతోంది. కాగా, మరోవైపు సౌమ్యరావు యాంకర్‌గా గుర్తింపు పొందడానికి ఎంతో కష్టపడుతోంది. అనసూయ ఆ స్థానానికి ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ బెంచ్ మార్క్‌ ను సౌమ్య రీచ్ అవుతుందో..? లేదో? వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -