Hyper Adi: సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న హైపర్ ఆది?.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు!

Hyper Adi: హైపర్ అది..ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ టెలివిజన్ షోలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోతో ఎంతో మంది కమెడియన్లు స్టార్లుగా మారారు. అలాంటి వారిలో హైపరి ఆది ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో, పంచులతో ఆడియెన్స్ కు వినోదాన్ని పంచుతుంటారు హైపర్ ఆది. ఆయన స్కిట్ ను చూసేందుకు టీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.

పెళ్లి ఊసెత్తని స్టార్ కమెడియన్
యూట్యూబ్ లో కూడా హైపర్ ఆది స్కిట్ లకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. ‘జబర్దస్త్‌’ షోతోపాటు ‘ఢీ’ లాంటి పలు ఇతర టీవీ షోల్లోనూ పాల్గొంటూ.. తన క్రేజ్ ను ఆది మరింతగా పెంచుకుంటున్నారు. సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారీ కమెడియన్. అలాంటి హైపర్ ఆది పెళ్లిపై మాత్రం ఊసెత్తడం లేదు. అయితే హఠాత్తుగా ఆయన మ్యారేజ్ ఫొటోస్ నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.

ఆ వీడియోలో నిజమెంత..?
పెళ్లి పీటలపై ఆది ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు కంగుతింటున్నారు. ఆదికి రహస్య వివాహం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని పరిశీలనలో తేలింది. ఒక సినిమా సన్నివేశంలో భాగంగానే హైపరి ఆది పెళ్లికొడుకుగా తయారయ్యారట.

అయితే కొందరు ఆ ఫొటోలను కావాలనే వైరల్ చేస్తూ.. హైపర్ ఆది మ్యారేజ్ అయ్యిందని ప్రచారం చేస్తున్నారని సమాచారం. హైపర్ ఆదితో పాటు ఉన్న ఆ పెళ్లి కూతురు సీనియర్ యాక్టర్ అని తెలుస్తోంది. గతంలో కూడా హైపర్ ఆదికి పెళ్లి జరిగిందని రూమర్స్ రావడం గమనార్హం. మరి, తాను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నానంటూ వస్తున్న వార్తల మీద హైపర్ ఆది ఎలా స్పందిస్తారేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -