Hyper Adi: గుండు చేయించుకున్న ఆది.. కెరీర్‌ను పణంగా పెట్టాడా?

Hyper Adi: బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది గురించి అందరికీ తెలిసిందే. స్కిట్‌లో ఆయన పంచులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఆయన కామెడీ టైమింగ్‌కి.. నాన్ స్టాప్ పంచులకు అందరూ పడి పడి నవ్వుతుంటారు. ఆది రైటింగ్స్‌ తో పాటు యాక్టింగ్‌కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. బుల్లితెరపై మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో హైపర్ ఆది కూడా కొనసాగుతున్నాడు. బుల్లితెరపై ఆది పంచులు వర్కౌట్ అయినా.. వెండి తెరపై మాత్రం ఎదురుదెబ్బె తగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆది చాలా వరకు సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమాల్లోనూ ఆయన వేసిన పంచులు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

 

 

సినిమాల్లో ఆది ఆకట్టుకోలేకపోయినా.. బుల్లితెరపై మాత్రం దూకుడు ప్రదర్శిస్తారు. వరుస పంచులతో అవతలి వ్యక్తులు నోరెళ్లబెట్టుకుంటారు. ప్రస్తుతం ఆది జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలో కొనసాగుతున్నాడు. జబర్దస్త్ కు కొన్ని నెలలపాటు దూరంగా ఉన్నా.. మళ్లీ షోలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో మల్లెమాల నుంచి బయటికి వెళ్తున్నట్లు ప్రచారం జరిగినా.. మళ్లీ షోలో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

 

 

జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలతో ఫుల్ బిజీ ఉంటున్నాడు హైపర్ ఆది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ ‘చదివింపులు’ ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ఎంతో ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. మధ్యలో రష్మి టాస్క్ మొదలు పెడుతుంది. ఆది ఓ నెంబర్‌ను సెలెక్ట్ చేయగా.. ’30 సెకన్లపాటు ఎవరినైనా ముద్దు పెట్టుకోవచ్చు’ అని వస్తుంది. ఆ తర్వాత మరో నెంబర్‌ను సెలెక్ట్ చేయగా.. ‘గుండు కొట్టించుకోవాలి’ అని వస్తుంది. దాంతో అందరూ ఆదిని పట్టుకుని గుండు కొట్టిస్తారు. ఇందులో ఆదిని ఘోరంగా అవమానించినట్లు తెలుస్తోంది. నిజానికి జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీలో హైపర్ ఆదికి తిరుగు ఉండదు. కానీ ఆదికి గుండు కొట్టినట్లు మల్లెమాల ప్రోమో రిలీజ్ చేసింది. నిజానికి ఆదికి గుండు కొట్టించారా? లేదా ప్రోమో కోసం ఇలా చేశారా? అనేది తెలియాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -