Samantha: ఆ రీజన్ వల్లే ప్రమోషన్స్‌కు వచ్చా.. సమంత షాకింగ్ కామెంట్స్

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా మయోటైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా రోజులుగా సమంత మీడియాకు దూరంగా ఉంటోంది. అయితే సోమవారం నాడు శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సమంత ఎమోషనల్ అయ్యింది. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతున్న సమయంలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. దీంతో సమంత మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. సమంత కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

శాకుంతలం సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా సమంత మీడియాతో మాట్లాడింది. తనకు ఆరోగ్యం బాగోకపోయినా ఎలాగైనా ఈ కార్యక్రమానికి రావాలని బలం తెచ్చుకుని వచ్చానని సమంత వెల్లడించింది. గుణశేఖర్‌పై ఉన్న అభిమానం, గౌరవంతోనే వచ్చానని.. ఎందుకంటే ఆయన సినిమాను ఎంతో ప్రేమిస్తారని తెలిపింది. శాకుంతలం సినిమాను కూడా గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారని.. ఈ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చుతుందని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది.

 

అటు తాను జీవితంలో ఎన్ని బాధలు భరించినా సినిమా మీద ప్రేమను వదులుకోలేదని సమంత చెప్పింది. ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమ దొరుకుతుందని అస్సలు అనుకోలేదని.. శాకుంతలం సినిమా విడుదలైన తర్వాత తనపై ప్రేక్షకులకు మరింత ప్రేమ పెరుగుతుందని అనుకుంటున్నట్లు అభిప్రాయపడింది. సినిమాను తాను ఎంత ప్రేమిస్తానో.. సినిమా కూడా తనను అంతే ప్రేమించడం నిజంగా అద్భుతమని సమంత పేర్కొంది.

 

ఫిబ్రవరి 17న శాకుంతలం విడుదల
అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో శాకుంతలం సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించాడు. ఈ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. ట్రైలర్ విడుదల సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఈ సినిమాలో ఏమి ఆశిస్తారో అవన్నీ ఉంటాయన్నాడు. సమంతను నమ్మి దిల్ రాజు భారీగా ఖర్చు పెట్టారని.. మైథలాజికల్ స్టాండర్డ్స్‌తో నేటి యూత్‌కు మెచ్చేలా క్లాసిక్ మీటర్‌ను పట్టుకుని ఈ సినిమాను తీశామన్నాడు. కాగా శాకుంతలం మూవీని గుణ టీమ్ వర్క్స్ బ్యానరుపై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ మూవీలో హీరోగా కనిపించనున్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పొరేట్ విద్య అంటే ఇదేనా.. ఏకంగా ఇంత చేశారా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను కార్పొరేటర్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దామని నాడు నీడలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత చదువులు చదువుతున్నారు...
- Advertisement -
- Advertisement -