Upasana: ఇంత ప్రేమను చూపించే భార్య దొరికింది.. ఉపాసన గ్రేట్ కదా!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున మెగా అభిమానులు సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక మెగా అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ పలు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఇక చిరంజీవి సైతం తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా చాలా గర్వంగా ఉంది నాన్న అంటూ తనకు ముద్దు పెడుతున్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

ఇలా ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు మెగా హీరోలందరూ కూడా రామ్ చరణ్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తుంది.ఈ క్రమంలోనే రాంచరణ్ సతీమణి ఉపాసన సైతం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు చూడనటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ హ్యాపీ బర్త్ డే బెస్టీ అంటూ లవ్ సింబల్ తో రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఇలా రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఒడిలో రామ్ చరణ్ కూర్చున్నటువంటి ఫోటోని ఈమె షేర్ చేశారు.ఇలా ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా అభిమానులు ఈ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఉపాసన ఒడిలో రామ్ చరణ్ అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇంత ప్రేమగా చూసుకునే భార్య దొరకడం నిజంగానే రామ్ చరణ్ అదృష్టం అంటూ పలువురు ఈ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు.

 

ఇక రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ ఏడాది మెగా కాంపౌండ్ లోకి మరొక బుల్లి వారసుడు రాబోతున్న సందర్భంగా మెగా ఫ్యామిలీ అలాగే అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కొద్ది నెలలలోనే రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా మారబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -