Trisha: నాకు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం: త్రిష

Trisha: సినిమా ఇండస్ట్రీలో స్టార్ల మధ్య పోటీ ఉండటం కామనే. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య ఇది సర్వసాధారణమే. గ్లామర్ ఫీల్డ్ లో తమకు ఇష్టమైన నటులు ఎవరంటే ఏ పాత తరం హీరోయిన్ల పేర్లు చెబుతారు గానీ ఇప్పటివారి గురించి మాత్రం చెప్పరు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమ అభిమాన నటీమణులు ఎవరంటే చాలాసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా త్రిషకు కూడా ఇదే రకమైన ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు నటించిన ‘రాంగి’ చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది. దానికి ఆమె కూడా తనదైన సహజమైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చింది.

 

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్న త్రిష గ్లామర్ ను మాత్రం బాగా మెయింటేయిన్ చేస్తోంది. రోజురోజుకీ ఆమె అందాన్ని పెంచుకుంటోంది గానీ తగ్గట్లేదు. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తరగని అందంతో యువత హృదయాలను కిర్రెక్కిస్తోంది. అందుకే దాదాపు 40 ఏళ్లకు దగ్గర్లో ఉన్నప్పటికీ ఆమెకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. అయితే త్రిష మాత్రం మంచి సినిమాను ఎంచకుంటూ ముందుకెళ్తున్నారు.

 

ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరింపజేసిన త్రిష.. ఇప్పుడు ‘రాంగీ’ మూవీతో బిగ్ స్ట్రీన్స్ లో తన నటనతో బ్లాస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. కొత్త ఏడాది కానుకగా డిసెంబర్ 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు కథను అందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను త్రిష స్పీడప్ చేశారు.

 

తెలుగులో సినిమా ఎప్పుడో..?
‘రాంగీ’ ప్రచార కార్యక్రమాల్లో మీకిష్టమైన నటి ఎవరని త్రిషను జర్నలిస్టులు ప్రశ్న అడిగారు. దీనికి అనుష్క అని ఠక్కున సమాధానమిచ్చిందీ డస్కీ బ్యూటీ. చాలా వరకు హీరోయిన్ల మధ్య ఈగోలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ తనకు అలాంటిది లేదని త్రిష ఈ జవాబుతో తేల్చేసింది. ఇక, త్రిష తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -