మొదటి జీతం ఎంతో చెప్పిన ఐఏఎస్‌.. దీటుగా స్పందిస్తున్న నెటిజన్లు

ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ ప్రతిరోజు తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడూ చర్చల్లో నిలుస్తున్నారు. ఈ సారి ట్వీటర్‌లో చేసిన పోస్టులో తన మొదటి జీతం గురించి చెప్పాడు. ఈ పోస్టు అతను తన గురించి చెప్పడమే కాకుండా ప్రజలను కూడా అడుగుతున్నారు. ఈ ఐఏఎస్ అధికారి పోస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అవినీష్ శరణ్-2008 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. యూపీఎస్సీ పరీక్షలో 77వ ర్యాంకు సాధించాడు. ఐఏఎస్ అధికారరి తనమొదటి జీతం 15,000 అని ట్వీట్‌ చేశాడు. అప్పటికి అతని వయస్సు 27 సంవత్సరాలు అతను ఆఫీసర్ ట్రైనీ ఐఏఎస్ గా ఈ జీతం పొందాడు. ఈ ట్వీట్‌లో మరి జీతమెంతా అంటూ ట్వీట్‌లో నెటిజన్లకు ప్రశించాడు.

ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ ఈ ట్వీట్ తర్వాత ప్రజల నుంచి ఆసక్తికరమైన కామెంట్స్ రావడం ప్రారంభం అయ్యాయి. కొంతమంది తమ మొదటి జీతం గురించి చెప్పగా.. మరికొందరు ఐఏఎస్ అధికారులను ప్రస్తుత జీతం గురించి అడుగుతున్నారు. అవినీష్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలకు సమాధానమిస్తున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి మొదటి వేతనం గంటకు రూ.10 అని కామెంట్ బాక్స్‌లో రాశాడు. ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్‌ ఇటీవల తన 10, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ మార్కులషీట్‌ను పంచుకున్నారు.

10వ తరగతిలో 44.7 శాతం మార్కులు సాధించగా 12వ తరగతిలో 65 శాతం ఫలితాలు వచ్చాయి. ఇది కాకుండా గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులు వచ్చాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపరేషన్ సమయంలో తాను 10 సార్లు ప్రిలిమినరీ పరీక్షలో ఫెయిలయ్యానని ఐఎఎస్ అవినీష్ చెప్పారు. అదే సమయంలో (యూపీఎస్సీ) ప్రిపరేషన్‌లో మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూకి చేరుకుంది. రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్షలో 77వ ర్యాంకు సాధించాడు. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు 10 రోజుల ముందు తాను ఏం చేశాడో కొన్ని రోజుల క్రితం అవినీష్ శరణ్ చెప్పాడు. పరీక్షకు సిద్ధం కావాలంటే 15-16 గంటల పాటు చదువుకోవాల్సి వచ్చింది. దీంతో పరీక్ష రోజు 102 డిగ్రీల జ్వరం వచ్చిందని ఐఏఎస్‌ అధికారి చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -