ICC: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ అవార్డు ఎవరికంటే..?

ICC: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల ఫర్‌ఫామ్మెన్స్, రికార్డులు, ఆటతీరును అంచనా వేసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి నెలలో ప్లేయర్ల ఫర్‌ఫామ్మెన్స్‌ను గమనించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటిస్తూ ఉంటుంది. అయితే గత నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నిలిచాడు.

వివిధ ఫార్మెట్లలో క్రికెటర్ ఆడి తీరును గమనించి ఈ అవార్డును ప్రకటిస్తారు. గత నెలలో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ అసిఫ్ ఖాన్ మధ్య పోటీ ఉంది. కానీ చివరికి మార్చి నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా షకీబ్ నిలిచాడు. దీనికి గాను షకీబ్ అల్ హసన్ హర్షం వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలవడం సంతోషంగా ఉందని చెప్పాడు.

 

మార్చిలో బంగ్లాదేశ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ లో షకీబ్ మంచి ఆటతీరును కనబర్చాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక రన్ స్కోరర్ తో పాటు అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా కూడా నిలిచాడు. దీంతో ఆల్ రౌండర్ ప్రదర్శన కనబర్చినందుకు గాను గత నెలకు అతడిని ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఐసీసీ ప్రకటించింది. ఇక ఇంగ్లండ్ తో జరిగిన టీ 20 సిరీస్ లోనూ షకీబ్ చెలరేగాడు. దీంతో వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ.. మూడు టీ20ల సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసింది. విశ్వవిజేత ఇంగ్లాండ్ ను మూడు మ్యాచ్ లలో ఓడించి టీ 20 సిరీస్ ను గెలుచుకోవడం అంటే బంగ్లాదేశ్ కు మాములు విషయం కాదు. ఇందులో షకీబుల్ శ్రమ ఎంతో ఉంది.

 

అలాగే గత నెలలో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ లోనూ షకీబుల్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మార్చి నెలలో అతడు 12 మ్యాచ్ లు ఆడగా.. 353 పరుగులు, 15 వికెట్లు తీశాడు. దీంతో షకీబుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కింది.

 

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -