Balayya: బాలయ్య ఛాలెంజ్ ను స్వీకరిస్తే బాబీ కెరీర్ ముగిసినట్టేనా?

Balayya: తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు బాబీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇది ఇలా ఉంటే దర్శకుడు బాబీకి ఇప్పుడు పెద్ద బాధ్యత పడింది. అదేమిటంటే బాలయ్య బాబుతో కలిసి కేవలం మూడు నెలల్లోనే ఒక సినిమాను పూర్తి చేయాలి. నాలుగు నెలలు ఫ్రీ ప్రొడక్షన్ కూడా ఉంది. మూడు నెలల్లోనే బాలయ్య బాబుతో సినిమాను పూర్తి చేయడమే బాబీకి ఉన్న అతిపెద్ద బాధ్యత.

ఈ విషయము బోయపాటికి చెప్పగా బోయపాటి తన వల్ల కాదని చేతులెత్తేసాడట. ఆగస్టు వరకు రామ్ సినిమా మీద వుండి, ఆ తరువాత స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ చూసుకుని మూడు నెలల్లో, అది కూడా డిసెంబర్ లోపు సినిమా అంటే తన వల్ల కాదని బోయపాటి అనడంతో, ఆ చాన్స్ దర్శకుడు బాబీకి వచ్చింది. కొనవెంకట్ కథ, మాటలు అందించడానికి రెడీగా ఉంటారు. కనుక బాబీకి కాస్త అండ వుండనే వుంటుంది. ఎంత కాదన్నా బాలయ్య సినిమా అంటే 80 రోజులు పైమాటే షూట్ చేయాల్సి వుంటుంది.

 

భగవత్ కేసరి సినిమా ముగించుకుని వచ్చే బాలయ్య నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తే డిసెంబర్ నాటికి సినిమా రెడీ అయిపోవచ్చేమో? చూడాలి. మొత్తానికి ఈ ప్రాజెక్టు బాబీకి పెద్ద టాస్క్ నే అని చెప్పవచ్చు. ఇకపోతే బాలయ్య బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే వీరాసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ...
- Advertisement -
- Advertisement -