BP: ఆ స్థాయికి బీపీ తగ్గిందంటే ఇక అంతే.. ఎంత ఉండాలో తెలుసా?

BP: ప్రస్తుత కాలం చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. తక్కువ లేదా అధిక రక్తపోటు సమస్య తరచూ వింటున్నాం. రక్తపోటు తక్కువగా ఉండటం, బ్లడ్‌ ప్రజెర్‌ ఎక్కువగా ఉండటం రెండూ ప్రమాదమే. వీటిని విస్మరించడం ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు పేర్కొంటున్నారు.
తక్కువ రక్తపోటును వైద్య భాషలో హైపోటెన్షన్‌ అంటారు. రక్తపోటు సాధారణ స్థాయి కంటే పడిపోయినప్పుడు దానిని లోబీపీ (లో బ్లడ్‌ ప్రెజర్‌) లేదా రక్తపోటు తక్కువగా ఉండటం అంటారు. రక్తపోటు తక్కువగా ఉన్న వ్యక్తుల్లో చాలా సార్లు తమకు తక్కువ రక్తపోటు సమస్య ఉందని కూడా గ్రహించలేరు.

శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభించినా దానిపై శ్రద్ధ చూపరు. రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు చాలా అలసట, వికారంగా అనిపిస్తుంది. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. తక్కువ రక్తపోటు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువగా ఉన్న వ్యక్తుల్లో చాలా సార్లు వారి బీపీ తగ్గినట్లు తెలియదు. బీపీ కొద్దిగా తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలాసార్లు లక్షణాలు కనిపించిన తర్వాత కూడా, లోబీపీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరం అవుతుంది.

 

లోబీపీ లక్షణాలివే..
మైకము, తల తిరగడం, ఏకాగ్రత లోపించడం,మూర్ఛ, అలసట, వాంతులు, వికారం, డీహైడ్రేషన్,దృష్టి కోల్పోవడం,అకస్మాత్తుగా కంటి చూపు తగ్గిపోవడం చర్మం లేత లేదా నీలం రంగులోకి మారడం, త్వరగా శ్వాస తీసుకోవడం, డిప్రెషన్‌ ఫీలింగ్,స్పహ కోల్పోవడం జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కారణాలు..
శరీరంలో రక్తం లేకపోవడం,గర్భధారణ సమయంలో శరీరంలో మార్పులు,
శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్య ఉన్నప్పుడు, తక్కువ రక్తపోటు వస్తోంది. అంతేకాక, విటమిన్లు, పోషకాలు లేకపోవడం, భారీగా రక్తస్రావం, కొన్ని మందుల దుష్ప్రభావాల కారణంగా కూడా తక్కువ రక్తపోటు వస్తోందని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన రక్తపోటు పరిధి 120/80 (ఎంఎంహెచ్‌జీ) ఉండాలి. దీన్ని సాధారణ రక్తపోటుగా పేర్కొంటారు. తక్కువ రక్తపోటుకు స్థిరమైన కటాఫ్‌ పాయింట్‌ లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది అందరిలో భిన్నంగా ఉంటుంది. రక్తపోటు 90/60 ఎమ్‌ఎమ్‌ హెచ్‌జీ కన్నా తక్కువగా ఉంటే ప్రమాదకరమైందని.. 130/90 అంతకంటే ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు (హైబీపీ)గా పరిగణిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -