Manchu Manoj: మనోజ్ రెండో పెళ్లి ఖర్చు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే?

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ ఓ ఇంటివాడ‌య్యాడు. భూమా మౌనికారెడ్డి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. శుక్ర‌వారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ పెళ్లి జరిగింది. మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు అలానే సినీ ఇండస్ట్రీ సెలబ్రెటీస్ హాజ‌ర‌య్యారు. మంచు మోహ‌న్‌బాబు, విష్ణుతో పాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

ఈ పెళ్లికి వైఎస్ విజ‌య‌మ్మ‌, మౌనిక‌రెడ్డి సోద‌రి అఖిల‌ప్రియ‌తో పాటు శాంత‌బ‌యోటెక్ అధినేత వ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి పెళ్లి వేడుక‌లో కనిపించారు. మ‌నోజ్‌, మౌనిక పెళ్లి ఫొటోలు అలానే వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగర్ సునీత ఆమె భర్తతో కలిసి రాగా, సిద్దు జొన్నలగడ్డ, తేజ సత్య, డైలాగ్ రైటర్ బివిఎస్ రవి, దర్శకుడు బాబి, వెన్నెల కిషోర్‌, ఇంకా అనేకమంది సెలబ్రెటీస్ సందడి చేశారు.

 

పెళ్లి బట్టల్లో మనోజ్, మౌనిక జంట మెరిసిపోయింది. బంగారు వర్ణం పట్టు కుర్తా, దోతిలో మనోజ్ కనిపించగా.. ఆకుపచ్చ, గులాబీ వర్ణం పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా ఉంది. గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాల్లో మౌనిక‌రెడ్డితో క‌లిసి పాల్గొన్నాడు మ‌నోజ్‌.

 

ఈ పెళ్లికి పెద్ద ఎత్తునే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. రెండో పెళ్లి అయినప్పటికీ రెండు కుటుంబాలకు బాగా డబ్బు ఉంది. కావున గ్రాండ్ గా చేశారు. ఏకంగా ఈ పెళ్లికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సినీ వర్గాల నుంచి తెలిసింది. ఈ స్థాయిలో మెుదటి పెళ్లి కూడా జరగలేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -