Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తే మామూలుగా ఉండదుగా!

Pawan Kalyan Fans: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పవన్ పై అభిమానాన్ని చాటితే ఫ్యాన్స్ దేవుడిలా చూస్తారు. అయితే ఆయన్ని ఏ మాత్రం విమర్శించినా ఊరుకోను. బండ బూతులు కూడా తిడతారు. పవనిజం అంటే అదేనని ఫ్యాన్స్ చెబుతారు. అయితే ఇక్కడొక డైరెక్టర్ మాత్రం పవన్ పై అభిమానాన్ని చాటుకున్నా తిట్లు తినాల్సి వచ్చింది. ఆ డైరెక్టర్ ఎవ్వరో కాదు శివ నిర్వాణ.

 

తాజాగా డైరెక్టర్ శివ నిర్వాణ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలోని ఓ పాటకు ఆయన డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ‘మేడిన్ ఆంధ్రా’ పాటకు శివ నిర్వాణ డ్యాన్స్ ఇరగదీశాడు. అయితే ఆయన ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. దానివల్ల పవన్ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ పెట్టడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అంతగా నచ్చకపోవడంతో ఆ టైటిల్ ను మార్చమని ఎప్పట్నుంచో వారు కోరుతున్నారు. అయితే ఈ మధ్య అది కాస్తా చల్లారిందనుకున్న టైమ్ లో, పవన్ పాటకు చిందులేస్తూ శివ నిర్వాణ వీడియో షేర్ చేశాడు.

 

ఆ వీడియోను చూసి పవన్ ఫ్యాన్స్ మరోసారి ఫైర్ అయ్యారు. ముందు టైటిల్ మార్చాలని, తర్వాతే ఇలాంటి వేషాలు వేయాలంటూ కొందరు గట్టిగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా పవన్ ఫ్యాన్ అయితే కల్ట్ మూవీ ఖుషి పేరును శివ నిర్వాణ వాడకూడదని ఇంకొందరు వార్నింగులు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. గంట గంటకూ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ ఎక్కువవ్వడంతో శివ నిర్వాణ ఆ వీడియోను డిలీట్ చేసేశాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -