YCP-TDP: టీడీపీ నిజంగా తప్పు చేసుంటే అలా బుక్ చేయొచ్చుగా జగన్!

YCP-TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో క్రాస్ ఓటింగ్ విషయం పెద్ద ఎత్తున సంచలనం మారింది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో భాగంగా వైసిపి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసిన విషయం మనకు తెలిసిందే.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన తెలివితేటలను ఉపయోగించి చాక చక్యంగా ఒక్కో ఎమ్మెల్యేను దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు డబ్బు ఆశ చూపించి కొనుగొలు చేశారనే వాదన వినిపిస్తుంది.

ఇలా డబ్బుకు ఆశపడినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కిపాల్పడ్డారని తెలియడంతో వారిపై అధికార పార్టీ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌లోభ పెట్ట‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌గా వైసీపీ అభివ‌ర్ణిస్తోంది. ఇలా వైసిపి నేతలు తరచు చంద్రబాబు నాయుడు డబ్బు ఆశ చూపించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ వాదన వినిపిస్తుంది.

 

నిజంగానే తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త ఆలోచించు గనుక ఉంటే మరోసారి చంద్రబాబు నాయుడుని ఓటుకు నోటు కేసులు ఇరికించే ప్రయత్నం చేసేవారు.నిజంగానే తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు డబ్బులు కనక ఇచ్చి ఉంటే ఈ విధంగా వారిని బుక్ చేసి తిరిగి ఓటుకు నోటు కేసులో వారిని ఇరికించవచ్చని పలువురు చెబుతున్నారు. టీడీపీ రాజ‌కీయాల‌కు ఎదుర్కోలేక వైసీపీ నిస్స‌హాయ అరుపులు అరుస్తోంద‌న్న అభిప్రాయాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

 

ఎమ్మెల్సీ గెల‌వ‌డానికి టీడీపీకి త‌గిన బ‌లం లేద‌ని వైసీపీ గ‌ట్టిగా వాదిస్తోంది. టీడీపీకి కేవ‌లం 19 మంది ఎమ్మెల్యేల బ‌లం మాత్ర‌మే ఉందంటూనే, మిగిలిన 156 ఎమ్మెల్యేలు త‌మ వైపు ఉన్నారని వైఎస్ఆర్సిపి పార్టీ భావిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి 23 ఓట్లు రావ‌డంతో వైసీపీ ఖంగుతింది. దీంతో టీడీపీపై విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టింది. ఈ క్రమంలోనే వైసిపి నేతలు మంత్రులు మాజీ మంత్రులు తెలుగుదేశం ప్రభుత్వంపై అలాగే నలుగురు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -