Devotional: దీపం,కొవ్వొత్తులు అలా ఆర్పేస్తే మీకు ఆ నష్టం గ్యారెంటీ?

Devotional: సృష్టిలోని గాలి, ఆకాశం, నేల, నీరు, నిప్పు.. ఈ ఐదింటిని మనం పంచభూతాలుగా పరిగణిస్తాము. అయితే వీటిలో దేని విలువ దానిదే. వీటిలో నిప్పుకి మనకు సంబంధం ఉంటుందని చెప్పవచ్చు. ఆ అగ్ని సూర్యుడితో పాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లోనూ ఉంటుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో అగ్ని ఉంటుంది. అందువల్ల మ‌నం తిన్న ఆహారం అగ్నికి ద‌హ‌న‌మై మ‌నకు శ‌క్తి ల‌భిస్తుంది. కాగా అగ్నికి మ‌న నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్య‌త ఉందన్న విషయం తెలిసిందే. అగ్నిని ఎట్టి ప‌రిస్థితిలోనూ అవ‌మానించకూడదు. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం అగ్నికి సంబంధించిన అన్ని వస్తువులను ఆగ్నేయ దిశలో నే ఉంచాలి.

అగ్నికి దేవతలతో సరిసమానమైన విలువ, ప్రాముఖ్యత ఉంటుంది. అగ్నికి సంబంధించిన దీపాలు, గ్యాస్ స్టవ్, మైక్రోవేవ్ ఓవెన్లు, టోస్టర్లు, హీటర్, కొవ్వొత్తులను ఇంటిలోని ఆగ్నేయ భాగంలో మాత్రమే ఉంచాలి. మీ ఇంటిలోని ఆగ్నేయ దిశలో మాత్రమే అగ్ని ఉండేలా జాగ్రత్త లు తీసుకోవాలి. అగ్నికి సంబంధించినవీ ఆగ్నేయ దిశలో కాకుండా ఇతర దిశలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఆగ్నేయ దిశ వాస్తుకు అనుకూలంగా లేకపోతే మహిళలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొత్తగా ఇల్లు నిర్మించే వారు కూడా తమ కిచెన్ ఆగ్నేయ దిశలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

 

ఇకపోతే చాలామంది ప్రజలు వెలిగించిన దీపం, కొవ్వొత్తి లేదా అగ్గిపుల్ల లను నోటితో ఊపీ ఆర్పేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం చాలా తప్పు. ఈ విధంగా అగ్నిని ఎప్పుడూ ఆర్పకూడదు. ఇలా చేస్తే అగ్నిని అవమానించినట్లే అవుతుంది. అంటే అగ్నిదేవుడిని అవమానించినట్లే. అప్పుడు అరిష్టం కలుగుతుంది. ముఖ్యంగా అగ్గిపుల్లలను పాదాల కింద వేసి ఆర్పితే సమస్యలు దరిచేరుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -