Devotional: చనిపోయిన వారి ఫోటోలు ఆ ప్రదేశాల్లో ఉంచితే.. అంతే సంగతులు?

Devotional: సాధారణంగా మనం ఇంట్లో అనేక రకాల ఫోటోలు తగిలించుకుంటూ ఉంటాము. రకరకాల ఫోటోలతో గోడలను అందంగా అలంకరిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల మా ఫోటోలను వాస్తు ప్రకారంగా మాత్రమే తగిలించుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు.. అందులో ముఖ్యంగా చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ ఉంచాలి? ఎక్కడ పెట్టకూడదు అన్న విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ విషయంలో చాలామంది తికమక పడుతూ ఉంటారు.

మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా చనిపోయిన వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకోవడం, నిత్యం వారిని స్మరించుకోవడం వల్ల ఆ వారి ఆశీశ్సులు ఉంటాయని భావిస్తారు. అందుకే ఫ్రేమ్ కట్టించి మరి ఇంట్లో గోడలకు తగిలిస్తారు. ఇంట్లో ఉంటే చాలుకదా అని ఎక్కడంటే అక్కడ పెడితే ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారంగా లేకపోతే వాటి ఫలితాలు ఆ ప్రభావం ఇంట్లో మనుషులపై చూపిస్తుంది. చాలా మంది చనిపోయినవారిపై అత్యంత ప్రేమ లేదా భక్తితో దేవుడి మందిరంలో పెడుతుంటారు.

 

ఇంకొందరు బెడ్ రూమ్స్ లో, డైనింగ్ రూమ్స్ లోనూ తగిలిస్తుంటారు. అస్సలు ఇలా చేయకూడదని చెబుతారు వాస్తుపండితులు. చనిపోయిన వారి ఫొటోలు దేవుడి మందిరంలో పెట్టకూడదు. ఇలా చేస్తే ఆ ఇంట సమస్యలు పెరుగుతాయ. బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. చనిపోయిన వారి ఫొటోల పక్కన బతికుండే వారి ఫొటోలు ఉండకుండా చూసుకోవాలి. కేవలం దక్షిణం వైపున్న గోడకు మాత్రమే చనిపోయిన వారి ఫోటోలను తగిలించాలి. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి స్థానం. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని అంటారు. దక్షిణంవైపు గోడకు చనిపోయిన వారి ఫొటోలు వేలాడదీసినట్టే వాటికి ఎదురుగా ఉత్తరం వైపు గోడకు ఆంజనేయుడి ఫొటో పెడితే ఇంకా మంచిది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -