Devotional: డబ్బు కొరత ఉండకూడదంటే కొబ్బరికాయతో ఇలా చేయాల్సిందే?

Devotional: భారతదేశంలో హిందువులు సంప్రదాయాలను ఆచారాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. వాటితో పాటు వాస్తు శాస్త్రాన్ని అలాగే జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా బాగా నమ్ముతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎన్నో రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి, సంపద శ్రేయస్సు కోసం, ఆనందం కోసం అనేక రకాల విషయాలను పాటిస్తూ ఉంటారు. చాలామంది డబ్బు కొరత సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ డబ్బు కొరత సమస్య కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు మానసిక ప్రశాంతత లేక అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.

అటువంటివారు కొబ్బరికాయతో ఈ విధంగా చేస్తే చాలు. మరి అందుకోసం కొబ్బరికాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా మన భారతీయ ధర్మంలో కొబ్బరికాయకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. మనం చేసే అన్ని మంచి పనుల్లో, పూజల్లో కొబ్బరికాయ తప్పకుండ భాగం అవుతుంది. కొబ్బరికాయతో పూజించడం వల్ల వారి ఆశీస్సులు పొందవచ్చు. అందుకే భక్తులు దేవాలయాల్లో కొబ్బరికాయను తప్పకుండ కొడతారు. అలాగే ఆ కొబ్బరి నీటితో దేవుళ్ళకు అభిషేకం కూడా చేస్తారు. కొబ్బరికాయ ఇల్లు, కుటుంబ సభ్యులపై చేదు దృష్టి పడడం వల్ల ఇంటిపై, ఇంట్లోని వ్యక్తుల జీవితంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని గొడవలు కూడా జరుగుతాయి. అలాంటివి జరగకుండా చేయాలంటే కొబ్బరికాయను బాధిత వ్యక్తి మీద నుండి 11సార్లు తిప్పాలి.

 

ఆ తర్వాత కొబ్బరికాయను కాల్చి, దాని బూడిదను చేసి నీటిలో కలిపేయాలి. ఇలా చేస్తే సానుకూల శక్తీ వస్తుంది. అలాగే ఆర్ధిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొన్ని నివారణలు చేయాలి. వాస్తు దోషాల వల్ల ఆర్ధిక సమస్యలు వస్తాయి. అయితే ప్రతి గురువారం నాడు లక్ష్మి దేవిని పూజిస్తే మంచిది. ఆ రోజు పసుపు రంగు బట్టను తీసుకుని అందులో కొబ్బరికాయ కట్టి లక్ష్మి పాదాల వద్ద ఉంచి వల్ల పూజించడం వల్ల లక్ష్మిదేవి, విష్ణువు కూడా ప్రసన్నమై ఆర్ధిక పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ఇంట్లో వ్యాధుల నుండి బయట పడాలంటే.. ఎర్రటి బట్టలో కొబ్బరికాయను చుట్టి దానిని రోగి శరీరంపై నుండి 7 సార్లు తిప్పి ఆ తర్వాత కొబ్బరికాయను హనుమంతుడి పాతాళ చెంత ఉంచితే వ్యాదుల బారిన పడిన వారు త్వరగా కోలుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -