Romance Tips: సెక్స్‌లో ఒత్తిడి వస్తే ఈ సమస్యలు వెంటాడుతాయి.. ఏం చేయాలంటే!

Romance Tips: ప్రశాంతమైన మనస్సు.. ఎలాంటి ఆలోచనలు లేకుండా సెక్స్‌లో పాల్గొంటేనే అనుకున్న సంతృప్తి లభిస్తోంది. కొన్ని కొన్ని తప్పిదాల వల్ల శృంగారంలో మజాను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శృంగారంలో మంచి అనుభూతి పొందాలంటే అందులో ఉంటే లోపాలను సవరించుకోవాలని సెక్స్‌లాజిస్టులు సూచిస్తుంటారు. శృంగారంలో ఎదురయ్యే సమస్యలకు కూడా ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయట. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయట. శృంగారంలో తలెత్తే సమస్యను నిర్లక్ష్యం చేయకుండా దృష్టి సారిస్తే ఆ మజా వేరు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

శృంగారం రంజుగా సాగకుండా చేయడంలో ఐదు సమస్యలకు చెక్‌ పెడితే శృంగారంలో అనుకున్న అనుభూతి పొందుతారు. సెక్స్‌లో తలెత్తే మొదటి సమస్య ఒత్తిడి. ఈ సమస్య ఉంటే ఏదీ మనసున పట్టదు. దీని కారణంగా కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది. మూడ్‌ రాకపోవడంతో నైరాశ్యం కమ్ముకుంటుంది. ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఈ నేపధ్యంలో ఒత్తిడిని దూరం చేసుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నిద్ర లేకపోవడం కూడా ఓ సమస్య కానుంది. నిద్ర లేకపోవడం వల్ల ఒంట్లో శక్తి తగ్గుతుంది. దీంతో శృంగారం పట్ల శ్రద్ధ కూడా ఉండదు. జీవిత భాగస్వామికి కూడా ఇబ్బందే. అందుకే నిద్ర లేకపోవడాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మనకు శక్తి ఇనుమడిస్తుంది. సంతృప్తికరంగా లేని సెక్స్‌ తో దంపతుల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉంటుంది. శృంగారంలో ఉన్న సమస్యలను దూరం చేసుకుంటే వారి దాంపత్య జీవితం సాఫీగా ముందుకు సాగుతోంది.

అసమతుల్య హార్మోన్లతో కూడా శృంగారాన్ని అనుభవించలేం. దీనికి చికిత్స చేయించుకోవాలి. వైద్యుడిని సంప్రదించి సరైన వైద్యం చేయించుకుని జీవిత భాగస్వామిని సుఖపెట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే జీవితం సుఖంగా సాగుతుంది. సంసారంలో రోజువారీ గొడవలు ఉండకుండా చూసుకోవాలి. దీంతో కూడా మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే మన ఆలోచన పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకు శృంగారంలో తలెత్తే సమస్యలకు ఎప్పటికప్పుడు చెక్‌ పెడితే దంపతులిద్దరూ సుఖ సంతోషాలతో వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -